Share News

నాన్న గర్వంగా చూస్తుంటారు!

ABN , Publish Date - Aug 21 , 2026 | 06:53 AM

కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ తన జీవిత ప్రయాణంపై ‘బిలాంగింగ్‌: ఏ జర్నీ ఆఫ్‌ లఫ్‌ పేరుతో రచించిన ఆత్మకథ పుస్తకం ఈ ఏడాది నవంబరులో మార్కెట్‌లోకి రానుంది. ఈ నేపథ్యంలో...

నాన్న గర్వంగా చూస్తుంటారు!

  • అమ్మా.. నువ్వు పడిన కష్టాలు నాకు, ప్రియాంకకు మాత్రమే తెలుసు

  • రాహుల్‌ గాంధీ భావోద్వేగ పోస్టు

  • త్వరలో సోనియా ఆత్మకథ పుస్తకం

న్యూఢిల్లీ, ఆగస్టు 20: కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ తన జీవిత ప్రయాణంపై ‘బిలాంగింగ్‌: ఏ జర్నీ ఆఫ్‌ లఫ్‌ పేరుతో రచించిన ఆత్మకథ పుస్తకం ఈ ఏడాది నవంబరులో మార్కెట్‌లోకి రానుంది. ఈ నేపథ్యంలో ఆమె కుమారుడు రాహుల్‌ గాంధీ గురువారం ‘ఎక్స్‌’ వేదికగా భావోద్వేగానికి గురయ్యారు. తన తల్లి ఆత్మకథ ఆమెను ప్రేమించే లక్షలాది మంది చదవబోతున్నందుకు గర్వంగా ఉందన్నారు. వ్యక్తిగత జీవితం గురించి బహిరంగంగా చెప్పుకొనేందుకు ఇష్టపడని తన తల్లి వంటి వ్యక్తికి.. ఆమె కథను ప్రపంచంతో పంచుకోవడం ఎంత కష్టమో తనకు తెలుసని పేర్కొన్నారు. ‘అమ్మా.. నిన్ను, నాన్నను కలిసి చివరిసారి చూసి 35 ఏళ్లకు పైగా అయింది. నాన్న వెళ్లిపోయినప్పటి నుంచి, జీవితంలో ప్రతి సవాల్‌ను ఎంతో ధైర్యంగా, గౌరవంగా ఎదుర్కొన్నావు. నాన్న వెళ్లిన నాటి నుంచి మీ జీవితం ఎంత కష్టంగా గడిచిందో, మీరు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారో నాకు, ప్రియాంకకు మాత్రమే తెలుసు’ అని రాహుల్‌ తన పోస్టులో రాసుకొచ్చారు. ఈ రోజు తన (రాజీవ్‌ గాంధీ) జయంతి నాడున, ‘నాన్న చిరునవ్వుతో తన అందమైన సోనియాను గర్వంగా చూస్తుండడం నాకు కనిపిస్తోంది’ అని పేర్కొన్నారు. సోనియా గాంధీ ఆత్మకథలో తన జీవితంలో జరిగిన కీలక పరిణామాలు, విషయాలను గురించి రాశారు. అందులో రాజీవ్‌ గాంధీతో ప్రేమ, వివాహం, ఆ తర్వాత తన భర్తను కోల్పోయే విషాదం, అనంతర పరిణామాల నేపథ్యంలో రాజకీయాల్లోకి రావాల్సి రావడం, 2004లో ప్రధాని పదవిని తిరస్కరించడం తదితర అంశాలను పంచుకున్నారు. ఈ పుస్తకం నవంబరు 10న మార్కెట్‌లోకి రానుందని పెంగ్విన్‌ రాండమ్‌ హౌస్‌ అమెరికన్‌ అనుబంధ సంస్థ ఆల్ర్ఫెడ్‌ ఏ నాఫ్‌ మంగళవారం ప్రకటించింది. అయితే పెంగ్విన్‌ రాండమ్‌ హౌస్‌ ఇండియా భారత్‌లో ఈ పుస్తకం విడుదల తేదీని ఇంకా ధ్రువీకరించలేదు.

ఇవి కూడా చదవండి:

పుట్టిన తేదీ మార్పుపై ఆరోపణలు.. చిక్కుల్లో పడిన బీసీసీఐ చీఫ్ మిథున్ మన్హాస్

బౌలింగ్‌లో జడేజా ప్రభావం తగ్గిపోయింది.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు

Updated Date - Aug 21 , 2026 | 06:53 AM