ప్రతిపక్ష నేత రబ్బర్ స్టాంప్ కాదు
ABN , Publish Date - May 13 , 2026 | 04:58 AM
సీబీఐ తదుపరి డైరెక్టర్ నియామక ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వ తీరుపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ...
సీబీఐ డైరెక్టర్ నియామక ప్రక్రియపై రాహుల్
న్యూఢిల్లీ, మే 12: సీబీఐ తదుపరి డైరెక్టర్ నియామక ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వ తీరుపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత రబ్బరు స్టాంప్ కాదని స్పష్టం చేశారు. సీబీఐ తదుపరి డైరెక్టర్ నియామకానికి సంబంధించి ప్రధాని మోదీ నాయకత్వంలో మంగళవారం అత్యున్నత స్థాయి కమిటీ సమావేశం జరిగింది. ప్రతిపక్ష నేత హోదాలో ఈ సమావేశానికి హాజరైన రాహుల్ గాంధీ.. పక్షపాత ధోరణిలో జరుగుతోన్న ఈ ఎంపిక ప్రక్రియలో తాను భాగం కానని పేర్కొంటూ రాసిన రెండు పేజీల లేఖను ప్రధానికి అందజేశారు. నచ్చిన వ్యక్తిని సీబీఐ డైరెక్టర్‌గా నియమించుకోవాలని కేంద్రం చూస్తోందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
తెలంగాణలో నూతన విద్యావిధానం అమలు చేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
దేశంలో ఉత్తమ వేతన నమూనాలను తెలంగాణలో అమలు చేస్తాం: మల్లు భట్టి విక్రమార్క
తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి..
Read Latest Telangana News And AP News And International News And Telugu News