ఢిల్లీ కోర్టులో రఘురామకు ఊరట
ABN , Publish Date - May 01 , 2026 | 06:09 AM
బ్యాంకుల రుణ ఎగవేత కేసులో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఊరట లభించింది...
బ్యాంకుల రుణ ఎగవేత కేసులో బెయిల్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 30(ఆంధ్రజ్యోతి): బ్యాంకుల రుణ ఎగవేత కేసులో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఊరట లభించింది. రెండో నిందితుడిగా ఉన్న ఆయనకు గురువారం బెయిల్ మంజూరు చేసింది. కేసు దర్యాప్తు సమయంలో రఘురామను అరెస్టు చేయని అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. రూ.50వేల పూచీకత్తు సమర్పించాలన్న నిబంధన విధించింది. నిందితులుగా ఉన్న మరో నలుగురికీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ 15 వేల పేజీలకు పైగా ఉంది. దీంతో ఈ భారీ పత్రాలను పరిశీలించేందుకు సమయం కావాలని నిందితుల తరఫు న్యాయవాదులు కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం, తదుపరి విచారణను జూలై 6కు వాయిదా వేసింది. నిందితుల కంపెనీల లిక్విడేషన్ (ఆస్తుల విక్రయ ప్రక్రియ) ఏ దశలో ఉందో పూర్తి వివరాలను సమర్పించాలని సంబంధిత అధికారులను న్యాయస్థానం ఆదేశించింది. కోర్టు గత ఆదేశాల మేరకు రఘురామ గురువారం వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యారు.
ఈ వార్తలనూ చదవండి:
అమెరికాకు హ్యాండిచ్చిన పాక్.. ఇరాన్‌కు సాయం!
పుతిన్ ఆఫర్‌ను తిరస్కరించిన ట్రంప్.. 90 నిమిషాలు మాట్లాడుకున్న నేతలు..