Share News

తిరుచ్చి ఈస్ట్‌ బరిలో రాఘవ లారెన్స్‌?

ABN , Publish Date - Jun 08 , 2026 | 05:58 AM

ప్రముఖ సినీనటుడు, కొరియోగ్రాఫర్‌, దర్శకుడు రాఘవ లారెన్స్‌ (49) రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. సీఎం విజయ్‌ పార్టీ టీవీకే తరఫున ఆయన ఎన్నికల బరిలోకి...

తిరుచ్చి ఈస్ట్‌ బరిలో రాఘవ లారెన్స్‌?

టీవీకే నుంచి పోటీచేస్తారని ప్రచారం

11న ప్రకటన చేయనున్నట్లు వెల్లడి

  • టీవీకే అభ్యర్థిగా పోటీచేస్తారని ప్రచారం.. 11న ప్రకటన!

చెన్నై, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ సినీనటుడు, కొరియోగ్రాఫర్‌, దర్శకుడు రాఘవ లారెన్స్‌ (49) రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. సీఎం విజయ్‌ పార్టీ టీవీకే తరఫున ఆయన ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. విజయ్‌ రాజీనామాతో తిరుచిరాపల్లి (తిరుచ్చి) ఈస్ట్‌ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలో పోటీ చేయడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అధినేత నేత విజయ్‌ తిరుచ్చి ఈస్ట్‌, పెరంబూరు నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచారు. సీఎం పదవిని చేపట్టాక తిరుచ్చి ఈస్ట్‌ శాసనసభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. ఇక్కడ లారెన్స్‌ టీవీకే తరఫున పోటీ చేయనున్నారంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో లారెన్స్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. తన భవిష్యత్‌ కార్యాచరణకు సంబంధించి కీలకమైన నిర్ణయాన్ని 11న ప్రకటిస్తానన్నారు. తిరుచ్చి ఈస్ట్‌ నియోజకవర్గం ఎన్నికల్లో తాను పోటీ చేయబోతున్నట్లు వివిధ ప్రసారమాధ్యమాల్లో వార్తలు వెలువడుతున్నాయని.. ఆ విషయమై తన వివరణ కోరుతూ మీడియా మిత్రులు చాలా మంది ఫోన్‌ ద్వారా, వ్యక్తిగతంగా సంప్రదిస్తున్నారని.. వాటిపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత తనకుందని తెలిపారు. ప్రస్తుతం తాను ‘బెంజ్‌’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నానని, చిత్రీకరణ షెడ్యూల్‌ ఈ నెల 10తో ముగుస్తుందని, మర్నాటి ఉదయం 9.30 గంటలకు విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి.. తన తల్లి ఆశీస్సులతో తన కెరీర్‌కు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాన్ని ప్రకటిస్తానని వివరించారు.

ఈ వార్తలు కూడా చదవండి...

ఫాంహౌస్‌ కేడీతోనైనా, ఢిల్లీలో మోదీతోనైనా కొట్లాడేందుకు సిద్ధం: సీఎం రేవంత్‌‌రెడ్డి

ఆ పనుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు.. మంత్రి సీతక్క వార్నింగ్

Read Latest Telangana News, AP News And National News

Updated Date - Jun 08 , 2026 | 05:58 AM