Share News

పంజాబ్‌లో జంట పేలుళ్లు బీజేపీ పనే కావొచ్చు: సీఎం మాన్‌

ABN , Publish Date - May 07 , 2026 | 07:19 AM

పంజాబ్‌లో మంగళవారం రాత్రి జరిగిన జంట పేలుళ్ల వెనక బీజేపీ హస్తం ఉండొచ్చని ఆ రాష్ట్ర సీఎం భగవంత్‌ మాన్‌ సంచలన ఆరోపణలు చేశారు. వచ్చే ఏడాది పంజాబ్‌లో ఎన్నికలు...

పంజాబ్‌లో జంట పేలుళ్లు బీజేపీ పనే కావొచ్చు: సీఎం మాన్‌

  • ఐఎస్‌ఐ, ఖలిస్థాన్‌ గ్రూపులపై దర్యాప్తు సంస్థల అనుమానాలు

న్యూఢిల్లీ, మే 6: పంజాబ్‌లో మంగళవారం రాత్రి జరిగిన జంట పేలుళ్ల వెనక బీజేపీ హస్తం ఉండొచ్చని ఆ రాష్ట్ర సీఎం భగవంత్‌ మాన్‌ సంచలన ఆరోపణలు చేశారు. వచ్చే ఏడాది పంజాబ్‌లో ఎన్నికలు జరగనుండడంతో బీజేపీయే వీటిని చేయించి ఉంటుందన్నారు. హింసకు పాల్పడి, ప్రజల్లో భయం సృష్టించి ఓట్లు పొందాలని ప్రయత్నిస్తోందని చెప్పారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ ఇలాంటివి సృష్టిస్తుందని విమర్శించారు. పేలుళ్లపై దర్యాప్తు సాగుతోందన్నారు. కాంగ్రెస్‌ కూడా ఇలాంటి తరహా విమర్శే చేసింది. జమ్మూ-కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా స్పందిస్తూ దేశంలో ఇంలాంటి పేలుళ్లు మామూలేనని, పెద్ద విషయమేమీ కాదని వ్యాఖ్యానించారు. మరోవైపు, ఈ జంట పేలుళ్ల వెనుక పాక్‌ గూఢచారి సంస్థ ఐఎ్‌సఐ పాత్ర ఉండవచ్చని భారత దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. ఆపరేషన్‌ సింధూర్‌ వార్షికోత్సవం సమీపిస్తున్న సమయంలో సైన్యానికి సంబంధించిన స్థలాల్లో ఈ పేలుళ్లు జరగడంతో పాక్‌ హస్తంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఖలిస్థాన్‌ ఉగ్రవాద గ్రూపుల పనికావచ్చని కూడా అంచనా వేస్తున్నాయి. మంగళవారం రాత్రి అమృత్‌సర్‌, జలంధర్‌ల్లో ఈ పేలుళ్లు సంభవించాయి. తొలుత ఎనిమిది గంటల సమయంలో జలంధర్‌లో ఉన్న బీఎ్‌సఎఫ్‌ ప్రధాన కార్యాలయం బయట పేలుడు కారణంగా ఓ స్కూటర్‌ మంటల్లో తగలబడిపోయింది. రెండు గంటల తరువాత అక్కడికి 100 కి.మీ.దూరంలోని అమృత్‌సర్‌-అత్తారీ రోడ్‌లోని ఆర్మీకి చెందిన ఖాసా క్యాంప్‌ గోడ వద్ద మరో పేలుడు సంభవించింది. వీటిపై దర్యాప్తునకు ఎన్‌ఐఏ రంగంలో దిగింది.

ఇవి కూడా చదవండి..

విజయ్ టీవీకేతో కాంగ్రెస్ పొత్తుపై కనిమొళి కీలక వ్యాఖ్యలు

సంఖ్యా బలం కావాలి.. విజయ్‌కు గవర్నర్ అనుమతి నిరాకరణ

Updated Date - May 07 , 2026 | 07:19 AM