ఆఫీస్‌లో దారుణం.. యువతిని కత్తితో పొడిచి చంపిన ప్రేమోన్మాది
ABN , Publish Date - Jun 05 , 2026 | 10:56 AM
పంజాబ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతి మాజీ ప్రియుడి చేతిలో దారుణ హత్యకు గురైంది. మాజీ ప్రియుడు ఆ యువతిని 20 సార్లు కత్తితో పొడిచి చంపాడు. యువతిని చంపిన తర్వాత అదే కత్తితో తనను తాను పొడుచుకుని ఆత్మహత్యకు యత్నించాడు.
ఇంటర్‌నెట్ డెస్క్: పంజాబ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతి మాజీ ప్రియుడి చేతిలో దారుణ హత్యకు గురైంది. మాజీ ప్రియుడు ఆ యువతిని 20 సార్లు కత్తితో పొడిచి చంపాడు. యువతిని చంపిన తర్వాత అదే కత్తితో తనను తాను పొడుచుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గురువారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. మొహాలికి చెందిన హర్వీందర్ మన్ అలియాస్ హ్యారీ, డింపుల్ మూడేళ్ల క్రితం ఓ కంపెనీలో కలిసి పని చేశారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్యా పరిచయం ఏర్పడింది.
ఆ పరిచయం ప్రేమగా మారింది. కొన్ని నెలల క్రితం ఇద్దరూ కొత్త కంపెనీలో చేరారు. కొత్త కంపెనీలో చేరిన కొంతకాలం వీరి బంధం సజావుగానే సాగింది. తర్వాత నుంచి గొడవలు మొదలయ్యాయి. కొద్దిరోజుల క్రితం ఇద్దరూ విడిపోయారు. డింపుల్‌తో విడిపోవటం హ్యారీకి ఇష్టం లేదు. మళ్లీ ఆమెతో ఒక్కడవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. డింపుల్ ఇందుకు ఒప్పుకోవటం లేదు. దీంతో అతడు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. గురువారం డింపుల్ డ్యూటీలో ఉండగా.. రాత్రి 7.40 గంటల ప్రాంతంలో హ్యారీ ఆఫీస్‌కు వచ్చాడు.
ఆమెతో గొడవ పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలోనే కత్తితో డింపుల్‌ను 20 సార్లు అతి కిరాతకంగా పొడిచాడు. తర్వాత అదే కత్తితో తన గొంతులో 30 సార్లు పొడుచుకుని ఆత్మహత్యకు యత్నించాడు. రక్తపు మడుగులో పడి ఉన్న ఇద్దరినీ సహోద్యోగులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు. డింపుల్‌ను పరీక్షించిన వైద్యులు ఆమె చనిపోయినట్లు ధ్రువీకరించారు. హ్యారీ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మైత్రీవనం అగ్నిప్రమాద ఘటన.. మరోసారి ఆధారాలు సేకరించనున్న క్లూస్ టీమ్