పంజాబ్లో డ్రగ్స్ అమ్మకాలను ప్రశ్నించిన సామాజిక కార్యకర్త పర్వీందర్ కాల్చివేత
ABN , Publish Date - Oct 14 , 2026 | 05:40 AM
పంజాబ్లో మాదక ద్రవ్యాల విక్రయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న సామాజిక కార్యకర్త పర్వీందర్ సింగ్ జోటా దారుణ హత్యకు గురయ్యారు
ఛండీగఢ్, అక్టోబరు 13: పంజాబ్లో మాదక ద్రవ్యాల విక్రయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న సామాజిక కార్యకర్త పర్వీందర్ సింగ్ జోటా దారుణ హత్యకు గురయ్యారు. మన్సా జిల్లాలో ఓ మెడికల్ స్టోర్లో మత్తు పదార్థాల అమ్మకాలను నిలదీసిన ఆయనను, షాపు యజమాని కాల్చిచంపడం స్థానికంగా కలకలం రేపింది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు మృతిచెందిన సామాజిక కార్యకర్త ఫోన్లో రికార్డయ్యాయి. ఈ దాడిలో జోటాతో పాటు అక్కడున్న మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ వార్తలు కూడా చదవండి
సీఈసీ రాజీనామా చేయకుంటే అభిశంసన తప్పదు.. ఎంపీ శశిథరూర్ హెచ్చరిక
నాసా–స్పేస్ఎక్స్ ప్రయోగం సక్సెస్.. ఐ ఎస్ ఎస్ కు 2,800 కేజీల సరుకులతో డ్రాగన్ నౌక