పంజాబ్ ఆప్ మంత్రి సంజీవ్ అరోరాకు జూన్ 1 వరకు జ్యుడీషియల్ రిమాండ్
ABN , Publish Date - May 18 , 2026 | 04:03 PM
ఆమ్ ఆద్మీ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. వస్తు సేవల పన్ను లావాదేవీలలో జరిగిన భారీ మోసాలకు సంబంధించి పంజాబ్ మంత్రి సంజీవ్ అరోరాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. సుమారు రూ.100 కోట్ల మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఈ అరెస్ట్ జరిగినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి.
న్యూఢిల్లీ, మే 18: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కి మరో ఎదురుదెబ్బ తగిలింది. వస్తు సేవల పన్ను (GST) లావాదేవీలలో జరిగిన భారీ మోసాలకు సంబంధించి పంజాబ్ మంత్రి సంజీవ్ అరోరాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు అరెస్ట్ చేశారు. సుమారు రూ.100 కోట్ల మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఈ అరెస్ట్ జరిగినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి.
అరెస్ట్ అనంతరం ఈడీ అధికారులు సంజీవ్ అరోరాను గురుగ్రామ్ సెషన్స్ కోర్టులో హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. ఆయనకి జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ కేసు తదుపరి విచారణను జూన్ 1వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.
జీఎస్టీ చెల్లింపులు, దానికి సంబంధించిన లావాదేవీలలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, తప్పుడు పద్ధతుల్లో నిధులను మళ్లించారనే ఆరోపణలపై గత కొంతకాలంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. సుమారు రూ. 100 కోట్ల మేర మనీలాండరింగ్ జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు లభించడంతో, లోతైన విచారణ కోసం మంత్రి సంజీవ్ అరోరాను ఈడీ బృందం అదుపులోకి తీసుకుంది.
పలువురు కీలక నేతలు ఇప్పటికే వివిధ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న తరుణంలో, పంజాబ్ మంత్రి అరెస్ట్ కావడం ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. దీనిపై పంజాబ్ ప్రభుత్వం, ఆప్ అధిష్ఠానం ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
ఈ వార్తలనూ చదవండి:
యూఏఈ అణువిద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి.. ఖండించిన భారత్
త్వరపడండి.. లేకపోతే మీకేమీ మిగలదు.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్