Share News

రెండో పెళ్లి కోసం బిడ్డను చంపిన మహిళ.. భర్త ఎంట్రీతో ఊహించని షాక్..

ABN , Publish Date - Apr 08 , 2026 | 01:10 PM

మహారాష్ట్రలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ రెండో పెళ్లి కోసం దారుణానికి ఒడిగట్టింది. కొత్త జీవితం కోసం 11 నెలల తన చంటిబిడ్డను దారుణంగా చంపేసింది. మొదటి భర్త ఎంట్రీతో ఆమెకు ఊహించని షాక్ తగిలింది. మర్డర్ విషయం బయటపడి జైలు పాలైంది.

రెండో పెళ్లి కోసం బిడ్డను చంపిన మహిళ.. భర్త ఎంట్రీతో ఊహించని షాక్..
Pune crime news

ముంబై, ఏప్రిల్ 8: ఓ మహిళ రెండో పెళ్లి కోసం దారుణానికి ఒడిగట్టింది. కొత్త జీవితం కోసం 11 నెలల తన చంటిబిడ్డను దారుణంగా చంపేసింది. మొదటి భర్త ఎంట్రీతో ఆమెకు ఊహించని షాక్ తగిలింది. మర్డర్ విషయం బయటపడి జైలు పాలైంది. ఈ సంఘటన మహారాష్ట్రలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. పుణెకు చెందిన 22 ఏళ్ల మహిళకు అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో 3 ఏళ్ల క్రితం పెళ్లయింది. వారికి ఓ మగ శిశువు జన్మించాడు. చిన్నారి వయసు 11 నెలలు.


భర్త అంటే ఇష్టం లేని ఆమె వేరే పెళ్లి చేసుకోవాలని అనుకుంది. సరైన సమయం కోసం ఎదురుచూస్తూ ఉంది. మార్చి 4వ తేదీన భర్త, బిడ్డతో కలిసి కొంకణ్ ప్రాంతంలో టూర్‌కు వెళ్లింది. టూర్ సందర్భంగా కొడుకు పదే పదే ఏడుస్తూ ఉండటంతో ఆమె అసహనానికి గురైంది. ఇంటికి వచ్చిన తర్వాత.. బిడ్డ ఆరోగ్యం బాగోలేదని, ఆస్పత్రికి తీసుకెళ్లమని భర్తను అడిగింది. అతడు ఆమె మాటలు పట్టించుకోకుండా తెలిసిన వాళ్ల పెళ్లికి వెళ్లిపోయాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఆమె మార్చి 8వ తేదీన బిడ్డను చంపేసింది. శవాన్ని బావిలో పడేసింది. భర్త దాచి పెట్టిన డబ్బులు తీసుకుని ఇంట్లోనుంచి పరారైంది. ఆ తర్వాత ఓ కొత్త సెల్ ఫోన్ కొనుగోలు చేసింది. మ్యారేజ్ ఏజెంట్ ద్వారా రెండో పెళ్లి చేసుకుంది.


ఆమె రెండో పెళ్లికి సంబంధించిన విషయం మొదటి భర్తకు తెలిసింది. అతడామె దగ్గరకు వచ్చాడు. తన బిడ్డను ఇచ్చేయమని అడిగాడు. ఆమె సరిగా స్పందించకపోవటంతో రంజన్‌గావ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఏప్రిల్ 5వ తేదీన పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ మహిళను అదుపులోకి తీసుకుని బిడ్డ గురించి విచారించారు. బిడ్డ ప్రమాదవశాత్తు చనిపోయాడని, భయంతో శవాన్ని బావిలో పడేశానని చెప్పింది. పోలీసులు బావి నుంచి చిన్నారి శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు మరింత లోతుగా విచారించటంతో ఆమె చేసిన నేరాన్ని ఒప్పుకుంది. మార్చి 8వ తేదీన బిడ్డను చంపేశానని చెప్పింది.


ఇవి కూడా చదవండి

ఆర్బీఐ వడ్డీ రేట్లలో మార్పుల్లేవు.. వృద్ధి రేటు 6.9 శాతంగా అంచనా..

అభ్యంతరకర వ్యాఖ్యలను హర్షించే రోజులకు కాలం చెల్లింది: జనసేన

Updated Date - Apr 08 , 2026 | 01:56 PM