Share News

కేతన్ మర్డర్ కేసు.. క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసిన పోలీసులు

ABN , Publish Date - Jun 28 , 2026 | 05:30 PM

పుణెకు చెందిన ప్రముఖ యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మర్డర్ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. హత్య జరిగిన 10 రోజుల తర్వాత నిందితులు సియా, చేతన్ చౌదరీలను క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం లోహగడ్ కోట దగ్గరకు తీసుకెళ్లారు.

కేతన్ మర్డర్ కేసు.. క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసిన పోలీసులు
Ketan Agarwal Siya Goyal

ఇంటర్‌నెట్ డెస్క్: పుణెకు చెందిన ప్రముఖ యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మర్డర్ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. హత్య జరిగిన 10 రోజుల తర్వాత నిందితులు సియా, చేతన్ చౌదరీలను క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం లోహగడ్ కోట దగ్గరకు తీసుకెళ్లారు. కేసు దర్యాప్తులో భాగంగా ఆదివారం ఇద్దరినీ కోట దగ్గరకు తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. దీనిపై పుణె రూరల్ ఎస్పీ సందీప్ సింగ్ గిల్ మాట్లాడుతూ..


‘క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం ఇద్దరు నిందితులను హత్య జరిగిన ప్రదేశం దగ్గరకు తీసుకెళ్లాము. అక్కడ సియా, చేతన్‌లు హత్య ఎలా చేశారో అన్ని వివరాలు చెప్పారు’ అని అన్నారు. పోలీసులు చెబుతున్న దాని ప్రకారం.. క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయటం ద్వారా ఘటన జరిగిన రోజున సియా, చేతన్‌ల కదలికలు.. వారు అక్కడ ఏం చేశారో దర్యాప్తు అధికారులు తెలుసుకున్నారు. ఆ ప్రదేశంలో జరిగిన వరుస సంఘటనలను పునఃసృష్టించారు.


క్రైమ్ సీన్ దగ్గర పునఃసృష్టి చేసిన సంఘటనలను దర్యాప్తు అధికారులు వీడియో రికార్డ్ చేశారు. నిందితులు కోటకు ఎలా చేరుకున్నారు? ఘటన సమయంలో వారు ఎక్కడెక్కడ ఉన్నారు? సంఘటనలు ఏ క్రమంలో జరిగాయి? అనే విషయాలను వారు పరిశీలిస్తున్నారు. క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ తర్వాత పోలీసులు సియాను తీసుకెళుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఇవి కూడా చదవండి

ప్రపంచ రోయింగ్ కప్: భారత్‌కు స్వర్ణం

బెంగళూరు చెత్త నగరంగా మారింది: పారిశ్రామికవేత్త కిరణ్ మజుందార్ షా

Updated Date - Jun 28 , 2026 | 05:35 PM