Share News

బాలుడి కస్టడీ వివాదం.. తల్లికి షాక్ ఇచ్చిన పుణె కోర్టు..

ABN , Publish Date - Jun 23 , 2026 | 01:30 PM

ఓ చిన్నారి కస్టడీ కేసులో పుణె కోర్టు సంచలన తీర్పునిచ్చింది. భర్త విషయంలో బాధ్యతలు విస్మరించిన భార్య తన పిల్లల సంరక్షణకు అనర్హురాలంటూ కోర్టు అభిప్రాయపడింది.

బాలుడి కస్టడీ వివాదం.. తల్లికి షాక్ ఇచ్చిన పుణె కోర్టు..

ఢిల్లీ: ఓ చిన్నారి కస్టడీ కేసులో పుణె కోర్టు సంచలన తీర్పునిచ్చింది. భర్త విషయంలో బాధ్యతలు విస్మరించిన భార్య తన పిల్లల సంరక్షణకు అనర్హురాలంటూ కోర్టు అభిప్రాయపడింది. ఈ సందర్భంగా తల్లి వద్ద ఉంటే పిల్లాడి భవిష్యత్తు సురక్షితం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు తల్లికి షాక్ ఇస్తూ చిన్నారి కస్టడీని తండ్రికి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.


ఈ సందర్భంగా పిల్లల సంరక్షణ విషయంలో కేవలం 'తల్లి' అనే హోదా ఒక్కటే సరిపోదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. భర్త, అత్తమామల పట్ల క్రూరంగా ప్రవర్తించే వివాహితకు పిల్లలను కస్టడీ ఇవ్వలేమని పేర్కొంది. వైవాహిక బాధ్యతలను, కుటుంబ విధులను పూర్తిగా విస్మరించిన మహిళ.. బాధ్యతారహిత ప్రవర్తన బాలుడి మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపుతుందని కోర్టు అభిప్రాయపడింది. చట్టం ప్రకారం పిల్లల సర్వతోముఖాభివృద్ధే అత్యంత ముఖ్యమైన విషయమని చెప్పుకొచ్చింది. నిరంతరం గొడవలు పెట్టుకునే వాతావరణంలో చిన్నారులు సురక్షితంగా పెరగలేరని తెలిపింది.


ఈ మేరకు అన్ని ఆధారాలను పరిశీలించిన తర్వాత బాలుడి సంరక్షణ బాధ్యతను తండ్రికి అప్పగించింది. తల్లికి కస్టడీ నిరాకరిస్తూ కేవలం నిర్ణీత సమయాల్లో మాత్రమే కుమారుడిని చూసుకునేందుకు అనుమతినిచ్చింది. ఈ సందర్భంగా పిల్లలను భాగస్వామిపై పగ తీర్చుకోవడానికి ఆయుధాలుగా వాడుకోలేరంటూ పుణె న్యాయస్థానం వ్యాఖ్యానించింది.


ఈ వార్తలు కూడా చదవండి

ఒకే కుటుంబంలో ముగ్గురి దారుణ హత్య.. కుమార్తెతోపాటు ఆమె ప్రియుడే నిందితులు..!

బాల్యంపై బ్యాగు భారం

Updated Date - Jun 23 , 2026 | 02:11 PM