Share News

3 ఏళ్ల బాలికపై హత్యాచారం.. వృద్ధుడికి మరణ శిక్ష

ABN , Publish Date - Jun 29 , 2026 | 04:18 PM

మూడేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన ఒక నిందితుడికి పుణె ఫాస్ట్ ట్రాక్ కోర్టు తాజాగా మరణ శిక్ష విధించింది. ఈ కేసు అత్యంత అరుదైనదని అడిషనల్ జడ్జి పేర్కొన్నారు.

3 ఏళ్ల బాలికపై హత్యాచారం.. వృద్ధుడికి మరణ శిక్ష
Death Sentence to POCSO Case Convict in Pune

ఇంటర్నెట్ డెస్క్: మూడేళ్ల బాలికపై హత్యాచారానికి పాల్పడ్డ 65 ఏళ్ల వృద్ధుడికి పుణెలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు మరణ శిక్ష విధించింది. ఈ కేసు అత్యంత అరుదైనదని అడిషనల్ జడ్జి ఎస్ఆర్ సాలంఖే అభిప్రాయపడ్డారు. అత్యంత పాశవిక చర్యకు పాల్పడ్డ నిందితుడు భిమ్‌రావ్ కాంబ్లేకు మరణ శిక్ష విధించక తప్పదని అన్నారు. గతంలోనూ పలు నేరాలు చేసిన చరిత్ర భీమ్‌రావ్‌ది అని పేర్కొన్నారు.


ఈ కేసులో కోర్టు భీమ్‌రావ్‌ను జూన్ 25న దోషిగా తేల్చింది. తాజాగా శిక్ష ఖరారు చేసింది. మే 1న జిల్లాలోని భోర్ తెహసిల్‌లోని నస్రాపూర్ గ్రామంలో నిందితుడు దారుణానికి ఒడిగట్టాడు. చిన్నారికి మాయమాటలు చెప్పి పసువుల షెడ్డులోకి తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డాడు. చిన్నారి మృతదేహాన్ని షెడ్డులో గుర్తించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన అనంతరం పోలీసులు నిందితుడిని అదుపులో తీసుకున్నారు. గతంలోనూ నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు.


ఈ వార్తలనూ చదవండి:

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అంత్యక్రియలు.. భారత్ తరఫున హాజరు కానున్న కేంద్ర మంత్రి!

జైపుర్‌లో విషాదం.. గోడ కూలడంతో ముగ్గురు కార్మికుల మృతి

Updated Date - Jun 29 , 2026 | 05:20 PM