బెంగాల్‌లో టీఎంసీ నేతలపై జనాగ్రహం
ABN , Publish Date - Jun 08 , 2026 | 05:51 AM
పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ నేతలపై జనాగ్రహం వెల్లువెత్తుతోంది. కట్ మనీ పేరిట నేతలు తమ వద్ద బలవంతంగా వసూలు చేసిన డబ్బు చెల్లించాలని ప్రజలు డిమాండ్...
కోల్‌కతా, జూన్ 7: పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ నేతలపై జనాగ్రహం వెల్లువెత్తుతోంది. కట్ మనీ పేరిట నేతలు తమ వద్ద బలవంతంగా వసూలు చేసిన డబ్బు చెల్లించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కట్ మనీ ఆరోపణలు ఎదుర్కొంటోన్న టీఎంసీ నేత బ్రహ్మానంద్ చక్రవర్తి పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్లినప్పుడు హౌరాలోని ఓ దుకాణంలో చీరల కింద దాక్కున్నారు. ఎట్టకేలకు పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. మాతాభంగా మున్సిపాలిటీలో కట్ మనీ తీసుకున్న టీఎంసీ కౌన్సిలర్ కకాలి ఘోష్ డబ్బు తిరిగి చెల్లిస్తున్నారు. తమ డబ్బు తిరిగి చెల్లించాలంటూ స్థానికులు టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్రా కారుపై గుడ్లతో దాడి చేశారు. టీఎంసీ నేత జయ ప్రకాశ్ మజుందార్, మాజీ మంత్రి స్వరూప్ దాస్‌పై కూడా ప్రజలు గుడ్లు విసిరి తమ నిరసన తెలియజేశారు. మరోవైపు సీఎం సువేందు బాగా పనిచేస్తున్నారంటూ మాజీ సీఎం బుద్ధదేవ్ సతీమణి మీరా ప్రశంసలు కురిపించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఫాంహౌస్ కేడీతోనైనా, ఢిల్లీలో మోదీతోనైనా కొట్లాడేందుకు సిద్ధం: సీఎం రేవంత్‌రెడ్డి
ఆ పనుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు.. మంత్రి సీతక్క వార్నింగ్
Read Latest Telangana News, AP News And National News