Share News

ముంబై లోకల్ రైల్వే స్టేషన్‌లో హత్య.. కారణమేంటో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

ABN , Publish Date - Jan 25 , 2026 | 05:09 PM

ముంబై మహానగరంలో ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్లాలంటే సాధారణ విషయం కాదు. రోజూ ఉద్యోగాలకు, స్కూళ్లు, కాలేజీకి వెళ్లేవారు ముంబై రవాణ వ్యవస్థతో యుద్ధం చేస్తుంటారు. ఈ క్రమంలో ముంబై వాసులు తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు.

ముంబై లోకల్ రైల్వే స్టేషన్‌లో హత్య.. కారణమేంటో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..
professor stabbed to death

ముంబై మహానగరంలో ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్లాలంటే సాధారణ విషయం కాదు. రోజూ ఉద్యోగాలకు, స్కూళ్లు, కాలేజీకి వెళ్లేవారు ముంబై రవాణ వ్యవస్థతో యుద్ధం చేస్తుంటారు. ఈ క్రమంలో ముంబై వాసులు తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. తాజాగా ముంబై మలాడ్ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఓ హత్య గురించి తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఒక కళాశాల ప్రొఫెసర్‌ను ఓ 27 ఏళ్ల యువకుడు దారుణంగా హత్య చేశాడు (professor stabbed to death).


విలే పార్లేలోని ఒక ప్రముఖ కళాశాలలో అలోక్ సింగ్ అనే వ్యక్తి ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. శనివారం ఉదయం ఆయన తన కాలేజ్‌కు వెళ్లడానికి లోకల్ రైలు ఎక్కారు. అదే రైలులో షిండే అనే వ్యక్తి కూడా ఎక్కాడు. రైలు మలాడ్ స్టేషన్‌కు సమీపించిన తర్వాత కిందకు దిగే విషయంలో ఇద్దరి మధ్య చిన్న వాదన మొదలైంది. ఇది చాలా మంది ముంబై నివాసితులకు రోజువారీ సమస్యే. రద్దీగా ఉండే స్టేషన్‌లో త్వరగా దిగకపోతే చాలా కష్టమవుతుంది. ఆ విషయంలో ఆ ఇద్దరి మధ్య మొదలైన గొడవ చాలా దూరం వెళ్లింది (Mumbai crime news).


ప్లాట్‌ఫామ్‌పై అడుగు పెట్టగానే షిండే సహనం కోల్పోయి తన బ్యాగ్‌లోని పదునైన కత్తిని బయటకు తీసి అలోక్ సింగ్ పొత్తికడుపులో అనేకసార్లు పొడిచాడు (railway station killing). సింగ్ రక్తపు మడుగులో కుప్పకూలిపోవడంతో, షిండే పారిపోయాడు. రైల్వే పోలీసులు వెంటనే దర్యాఫ్తు ప్రారంభించారు. దాడి జరిగిన కొద్దిసేపటికే తెల్లటి చొక్కా, నీలిరంగు జీన్స్ ధరించిన ఒక వ్యక్తి ఫుట్ ఓవర్ బ్రిడ్జి మీదుగా పారిపోతున్న దృశ్యాలను సీసీటీవీ ఫుటేజ్‌లో చూశారు.


పోలీసులు అతడిని ట్రాక్ చేసి గుర్తించి ఆదివారం అరెస్ట్ చేశారు. రైలు దిగడంపై వాదన కారణంగానే ఈ హత్య జరిగిందని తేలినప్పటికీ, ఇద్దరి మధ్య ముందస్తు శత్రుత్వం ఉందా లేదా అని పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. హత్య మరీ దారుణంగా ఉండడంతో ఇద్దరి మధ్య ఇతర అంశాలలో శత్రుత్వం ఉందా అని పోలీసులు విచారణ సాగిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ ఫొటోలో దాక్కున్న ముగ్గురిని 10 సెకెన్లలో కనిపెట్టండి..


వార్నీ.. వాషింగ్ మెషిన్‌ను ఇలా కూడా వాడతారా.. గోధుమలను ఎలా ఆరబెడుతోందో చూడండి..

Updated Date - Jan 25 , 2026 | 05:09 PM