Share News

‘గోమూత్రం నిపుణుడు’ వ్యాఖ్యలపై దుమారం

ABN , Publish Date - Jul 31 , 2026 | 06:00 AM

ప్రశ్నపత్రాల లీకేజీల నియంత్రణకు కేంద్రం నియమించిన హైపవర్డ్‌ కమిటీలో సభ్యుడైన ఐఐటీ మద్రాస్‌ డైరెక్టర్‌ వి. కామకోటిపై కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా చేసిన వ్యాఖ్యలు...

‘గోమూత్రం నిపుణుడు’ వ్యాఖ్యలపై దుమారం

  • ప్రియాంక గాంధీకి 215 మంది విద్యావేత్తల బహిరంగ లేఖ

న్యూఢిల్లీ, జూలై 30: ప్రశ్నపత్రాల లీకేజీల నియంత్రణకు కేంద్రం నియమించిన హైపవర్డ్‌ కమిటీలో సభ్యుడైన ఐఐటీ మద్రాస్‌ డైరెక్టర్‌ వి. కామకోటిపై కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ 215 మంది వైస్‌ చాన్సలర్లు, మాజీ వీసీలు, విద్యావేత్తల సంతకాలతో గురువారం ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. ప్రొఫెసర్‌ కామకోటిని గోమూత్ర నిపుణుడు అని ఆమె అభివర్ణించడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలోనే నిష్ణాతుడైన ఒక శాస్త్రవేత్తను కించపరిచేలా ప్రియాంక చేసిన వ్యాఖ్యలు తమను నిరాశకు గురిచేశాయని తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

కువైట్‌లోని చైనా కంపెనీపై ఇరాన్ దాడి

కుట్రపూరిత వీసా కేసు.. అమెరికా నుంచి భారతీయుడి బహిష్కరణ

Updated Date - Jul 31 , 2026 | 06:00 AM