మోదీ 76
ABN , Publish Date - Sep 18 , 2026 | 12:58 AM
ప్రధాని మోదీ 76వ పుట్టిన రోజును జరుపుకొన్నారు. గురువారం జన్మదినం సందర్భంగా మోదీకి దేశ, విదేశాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ‘గత 25 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా, ప్రధానిగా సుపరిపాలనలో అనేక కొత్త ప్రమాణాలను నెలకొల్పారు. సమ్మిళిత అభివృద్ధికి కొత్త దిశను చూపారు’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు.
ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 17: ప్రధాని మోదీ 76వ పుట్టిన రోజును జరుపుకొన్నారు. గురువారం జన్మదినం సందర్భంగా మోదీకి దేశ, విదేశాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ‘గత 25 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా, ప్రధానిగా సుపరిపాలనలో అనేక కొత్త ప్రమాణాలను నెలకొల్పారు. సమ్మిళిత అభివృద్ధికి కొత్త దిశను చూపారు’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ‘దేశసేవనే జీవిత ధ్యేయంగా సాగుతున్న మోదీ జీవితం కోట్లాది మందికి స్ఫూర్తి.. ఆయన నాయకత్వంలో దేశం ప్రగతి పథంలో కొత్త శిఖరాలను అధిరోహించాలి’ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆకాంక్షించారు. ఇటు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ముఖ్యమంత్రులు విజయ్, వీడీ సతీశన్, హిమంత బిశ్వ శర్మ, పుష్కర్‌సింగ్ ధామి, ప్రేమ్‌సింగ్ తమాంగ్ తదితరులు.. సినీ రంగ ప్రముఖులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, కమల్‌హాసన్, మోహన్‌లాల్, చిరంజీవి, మహేశ్‌బాబు కూడా మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని సహా పలువురు ప్రపంచ నేతలు ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తరఫున భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం కూడా ప్రధానికి శుభాకాంక్షలు తెలిపింది. ఇక ప్రధాని పుట్టినరోజు సందర్భంగా ‘ఆశీర్వాద్ కా దియా’ అనే ప్రత్యేక పాట ను సంగీత దర్శకుడు అమన్‌పంత్, గాయని స్నేహ శంకర్ రూపొందించి.. ఆయనకు అంకితమిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
మాజీ ఎమ్మెల్యే ఉప్పల మల్సూర్ కుటుంబానికి సీఎం రేవంత్ అండ
ఫ్యూచర్ సిటీలో ఎస్‌బీఐ డేటా సెంటర్ ఏర్పాటు.. 10 ఎకరాలు కేటాయించిన సర్కార్