వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
ABN , Publish Date - Aug 09 , 2026 | 06:02 AM
వందేమాతరం గేయానికి చట్టపరంగా రక్షణలు కల్పిస్తూ తీసుకొచ్చిన సవరణలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు...
న్యూఢిల్లీ, ఆగస్టు 8: వందేమాతరం గేయానికి చట్టపరంగా రక్షణలు కల్పిస్తూ తీసుకొచ్చిన సవరణలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. జాతీయ గౌరవాలకు అవమాన నిరోధక చట్టం-1971 ప్రకారం ఇంతవరకు జాతీయగీతమైన జనగణమనకు చట్టపరమైన రక్షణ ఉంది. ఆ చట్టానికి సవరణలు చేస్తూ అలాంటి రక్షణను వందేమాతరం గీతానికి కూడా కేంద్ర ప్రభుత్వం వర్తింపజేసింది. ఈ చట్టం ప్రకారం.. జాతీయ గీతంతో పాటు వందేమాతరాన్ని కూడా అధికారిక కార్యక్రమాల్లో ఆలపించాల్సి ఉంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి
ఆగ్రాలో రహదారిపై భారీ గుంత.. అందరూ చూస్తుండగానే..
డిగ్రీలు మాత్రమే కాదు.. దేశ స్వప్నాన్నీ సాకారం చేయాలి: మోదీ