పెను విషాదం.. హిప్పో దాడిలో ప్రాణాలు కోల్పోయిన డాక్టర్..
ABN , Publish Date - Mar 21 , 2026 | 05:01 PM
హిప్పోపోటమస్ దాడిలో పశు వైద్యురాలు ప్రాణాలు కోల్పోయారు. గర్భంతో ఉన్న హిప్పోను చెక్ చేయడానికి వెళ్లిన సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
ఇంటర్‌నెట్ డెస్క్: కర్ణాటకలో పెను విషాద ఘటన ఒకటి చోటుచేసుకుంది. హిప్పోపోటమస్ దాడిలో పశు వైద్యురాలు ప్రాణాలు కోల్పోయారు. గర్భంతో ఉన్న హిప్పోను చెక్ చేయడానికి వెళ్లిన సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన 27 ఏళ్ల సమీక్షారెడ్డి త్యావరకొప్ప టైగర్, లయన్ సఫారీలో కాంట్రాక్ట్ బేసిస్ కింద పశువైద్యురాలిగా సేవలు అందిస్తున్నారు. గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో ఆమె జూలోని సన్ కాపర్ పక్షికి చికిత్స చేయడానికి వెళ్లారు.
పక్షికి చికిత్స పూర్తయిన తర్వాత గర్భంతో ఉన్న హిప్పో టెంపరేచర్ చేయడానికి ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఆ హిప్పో ఆమెపై దాడి చేసింది. తలతో బలంగా సమీక్షారెడ్డిని కొట్టింది. దీంతో ఆమె ఊపిరితిత్తులు, లివర్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. జూ సిబ్బంది ఆమెను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో సమీక్షారెడ్డి ప్రాణాలు విడిచారు. పశువైద్యురాలి మృతిపై కర్ణాటక అటవీశాఖ మంత్రి ఈశ్వర్ బీ ఖండ్రే స్పందించారు. సమీక్షారెడ్డి కుటుంబానికి సానుభూతి తెలిపారు.
ప్రభుత్వం తరఫు నుంచి 30 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. కాగా, సమీక్షారెడ్డి హెబ్బల్‌లోని వెటర్నరీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. 2023లో డిగ్రీ పూర్తి అయిన తర్వాత కొంతకాలం పాటు మంగళూరు సర్కిల్ వైల్డ్ లైఫ్ డాక్టర్ దగ్గర అసిస్టెంట్‌గా పని చేశారు ఫిబ్రవరి నెల నుంచి శివమొగ్గ జూలో కాంట్రాక్ట్ బేసిస్ కింద పశువైద్యురాలిగా సేవలు అందిస్తున్నారు. జూలో విధుల్లో చేరి రెండు నెలలు కాకుండానే ఈ విషాదం చోటుచేసుకుంది.
ఇవి కూడా చదవండి
ట్రక్కు ఢీకొని గో సంరక్షుడు ఫర్సా వాలే బాబా మృతి.. మథురలో ఉద్రిక్తత
ఈ 3 ప్రత్యేక లక్షణాలు ఉన్నవారు స్వార్థపరులే