ఈ 3 ప్రత్యేక లక్షణాలు ఉన్నవారు స్వార్థపరులే
ABN , Publish Date - Mar 21 , 2026 | 04:45 PM
స్వార్థపరులను గుర్తించడానికి కొన్ని స్పష్టమైన లక్షణాలను ఆచార్య చాణక్యుడు వివరించారు. ఆ లక్షణాలు ఏమిటో తెలుసుకుంటే, భవిష్యత్తులో పెద్ద నష్టాల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది.
ఇంటర్నెట్ డెస్క్: మన చుట్టూ చాలా మంది స్వార్థపరులు ఉంటారు. తమ ప్రయోజనాల కోసం మాత్రమే దగ్గరవుతారు. ఇలాంటి స్వార్థపరులను ముందుగానే గుర్తించకపోతే, మనకు నష్టం కలగవచ్చు. ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో స్వార్థపరులను గుర్తించడానికి కొన్ని స్పష్టమైన సంకేతాలు చెప్పారు. అవేంటో తెలుసుకుందాం..
అతిగా పొగడటం
అతి మధురంగా మాట్లాడే వ్యక్తల విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలని చాణక్యుడు సూచించారు. అవసరం లేకపోయినా ఎక్కువగా పొగుడుతారు. వారి మాటల వెనుక అసలు ఉద్దేశం దాగి ఉంటుంది. మితిమీరిన ప్రశంసలు ఎక్కువగా చేసే వారు నిజమైన స్నేహితులు కాకపోవచ్చని చాణక్యుడు పేర్కొన్నారు.
అవసరం కోసం మాత్రమే
ఎవరైనా అకస్మాత్తుగా ఎక్కువ ప్రేమ చూపిస్తే, వారికి మీ దగ్గర ఏదో అవసరం ఉండే అవకాశం ఉంది. తమకు పని ఉన్నప్పుడు మాత్రమే కాల్ లేదా మెసేజ్ చేస్తారు. పని అయిపోయాక మిమ్మల్ని పూర్తిగా మర్చిపోతారు.
చెడుగా మాట్లాడటం
మీ ముందు ఇతరుల గురించి చెడుగా మాట్లాడుతారు. తమను గొప్పగా చూపించుకోవడానికి ఇతరులను తగ్గిస్తారు. ఇలా ఇతరుల గురించి చెడుగా మాట్లాడితే, రేపు మీ గురించి కూడా చెడుగా మాట్లాడే అవకాశం ఉంది.
స్వార్థపరులను గుర్తించడం చాలా ముఖ్యం. వారి మాటలకన్నా వారి ప్రవర్తనను గమనిస్తే వారు ఎలాంటి వారో తెలుస్తుంది. ఇలాంటి వారిని ముందుగానే గుర్తించి దూరంగా ఉంటే, మనం అనవసరమైన సమస్యల నుంచి తప్పించుకోవచ్చని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో సూచించారు.
Also Read:
ఆరోగ్య బీమా లేదా అత్యవసర నిధి.. ఏది ముఖ్యం
పెర్ఫ్యూమ్ అవసరం లేకుండా చెమట వాసన పోవాలా? ఈ చిట్కాలు ఫాలో అవండి
For More Latest News