‘ధర్మస్థల కుట్ర’లో ప్రకాశ్‌రాజ్ పేరు!
ABN , Publish Date - Jun 13 , 2026 | 06:01 AM
ధర్మస్థలలో వందలాదిమంది యువతులను దారుణంగా హతమార్చారంటూ...పన్నిన కుట్ర వ్యవహారంలో ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ పేరు ప్రస్తావనకు వచ్చింది. మండ్య తాలూకా
రెండు రోజుల్లో మీడియా ముందుకొస్తానంటూ వివరణ
బెంగళూరు, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): ధర్మస్థలలో వందలాదిమంది యువతులను దారుణంగా హతమార్చారంటూ...పన్నిన కుట్ర వ్యవహారంలో ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ పేరు ప్రస్తావనకు వచ్చింది. మండ్య తాలూకా చిక్కబళ్లి గ్రామానికి చెందిన చిన్నా అలియాస్ చిన్నయ్య (ముసుగు మనిషి) కుట్రకు సూత్రధారుడిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ధర్మస్థల వివాదం కుట్రపూరితమని సిట్ తేల్చింది. ఈ నేపథ్యంలో సూత్రధారి చిన్నయ్య హైకోర్టులో దాఖలు వేసిన రిట్ పిటిషన్‌పై గురువారం న్యాయమూర్తి జస్టిస్ సూరజ్ గోవిందరాజ్ ఏకసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ‘నేను మళ్లీ వచ్చి మిమ్మల్ని కలుస్తాను’ అంటూ కుట్రదారులతో ప్రకాశ్‌రాజ్ అన్న విషయం రిట్ పిటిషన్‌లో పేర్కొన్నట్టు సమాచారం. దీనిపై ప్రకాశ్‌రాజ్ శుక్రవారం సోషల్ మీడియా ఖాతాలో స్పందించారు. మీడియా, సోషల్ మీడియాలో ధర్మస్థల వివాదానికి సంబంధించి తన పేరు ప్రస్తావన వచ్చిందని, అతి సున్నితమైన, కోట్లాదిమంది భక్తుల నమ్మకానికి సంబంధించిన అంశమని, ఇటువంటి అనుమానాలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత తనపై ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతానికి తాను సుదూరంగా ఉన్నాననీ, రెండు రోజుల్లో స్వయంగా వచ్చి మీడియాకు వివరిస్తానన్నారు. ధర్మస్థల పవిత్రతకు భంగం కలిగించేందుకు కేరళ నుంచి 200 కోట్ల రూపాయల బడ్జెట్‌తో భారీ కుట్ర జరిగినట్టు రిట్ పిటిషన్‌లో చిన్నయ్య ప్రస్తావించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హరీశ్ రావు ఆరోపణలు.. స్పందించిన మంత్రులు
రిజర్వేషన్లపై కేంద్రానికి సమర్పించనున్న జస్టిస్ బాలకృష్ణన్ నివేదిక.. సర్వత్ర ఉత్కంఠ
Read Latest TG News And Telugu News