Share News

ఇది నాకు కొత్త సబ్జెక్టు: ప్రహ్లాద్‌ జోషి

ABN , Publish Date - Jul 27 , 2026 | 06:35 AM

కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్‌ జోషి ఆదివారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా రంగం తనకు కొత్త సబ్జెక్టు అని, పూర్తి బాధ్యతతో పనిచేస్తానని...

ఇది నాకు కొత్త సబ్జెక్టు: ప్రహ్లాద్‌ జోషి

  • విద్యాశాఖ మంత్రిగా బాధ్యతల స్వీకరణ

న్యూఢిల్లీ, జూలై 26: కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్‌ జోషి ఆదివారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా రంగం తనకు కొత్త సబ్జెక్టు అని, పూర్తి బాధ్యతతో పనిచేస్తానని అన్నారు. ప్రస్తుతం శాఖలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై సమీక్షిస్తున్నట్లు చెప్పారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించి, విధివిధానాలపై చర్చించామని జోషి వివరించారు. ‘ఇది చాలా పెద్ద శాఖ, దీని పనితీరుపై పూర్తి అవగాహన వచ్చిన తర్వాతే వివరంగా మాట్లాడతా’ అని జోషి పేర్కొన్నారు. కాగా, తనపై పూర్తి నమ్మకంతో విద్యాశాఖ బాధ్యతలను అప్పగించిన ప్రధాని మోదీకి ఆయన ‘ఎక్స్‌’లో కృతజ్ఞతలు తెలిపారు. ఎంతో వినయంతో, బాధ్యతా భావనతో ఈ పదవిని స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం జోషి కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖల మంత్రిగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఆయన బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖల మంత్రిగా పనిచేశారు.

ఇవి కూడా చదవండి:

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వేళ బీజేపీ ఎంపీ కుమార్తె పోస్ట్ కలకలం

అడవిలో తప్పిపోయిన 23 మంది అధికారులు.. చివరకు

Updated Date - Jul 27 , 2026 | 06:35 AM