Share News

బడ్జెట్ ప్రసంగం తర్వాత 30 మంది విద్యార్థులతో నిర్మలమ్మ మీటింగ్.. కారణం ఏంటంటే..

ABN , Publish Date - Feb 01 , 2026 | 11:46 AM

బడ్జెట్ ప్రసంగం పూర్తయిన తర్వాత మంత్రి నిర్మలా సీతారామన్ 30 మంది విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నట్టు సమాచారం. బడ్జెట్ రూపకల్పన విషయాలు, విధి విధానాల గురించి వారితో మాట్లాడబోతున్నారు.

బడ్జెట్ ప్రసంగం తర్వాత 30 మంది విద్యార్థులతో నిర్మలమ్మ మీటింగ్.. కారణం ఏంటంటే..
Nirmala Sitharaman budget

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు. బడ్జెట్ ప్రసంగం పూర్తయిన తర్వాత మంత్రి నిర్మలా సీతారామన్ 30 మంది విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారని సమాచారం. బడ్జెట్ రూపకల్పన విషయాలు, విధి విధానాల గురించి వారితో మాట్లాడబోతున్నారు(Union Budget 2026-27).


ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యేందుకు దేశవ్యాప్తంగా ఉన్న కళాశాలలకు చెందిన 30 మంది విద్యార్థలను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఎంపికైన ఈ విద్యార్థులు లోక్‌సభ గ్యాలరీలో కూర్చుని ప్రత్యక్షంగా బడ్జెట్ ప్రసంగాన్ని వింటారు. అలాగే కర్తవ్య భవన్‌లోని ఆర్థిక మంత్రిత్వ శాఖను కూడా సందర్శించనున్నారు. ఆర్థిక శాఖ నిర్ణయాలను అత్యున్నత్త స్థాయిలో ఎలా తీసుకుంటారు, వారిని ఎలా అమలు చేస్తారనే విషయాల గురించి విద్యార్థులకు అవగాహన కలిగించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది(Nirmala Sitharaman meeting students).


పార్లమెంట్‌లో బడ్జెట్‌ను సమర్పించే కార్యక్రమం పూర్తయిన అనంతరం మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విద్యార్థులతో సమావేశం అవుతారు(post budget interaction). బడ్జెట్ గురించి వారి అభిప్రాయాలను, సూచనలను తెలుసుకుంటారు. అలాగే బడ్జెట్ గురించి వారు అడిగే సందేహాలకు సమాధానాలు చెబుతారు. పరిపాలనకు సంబంధించిన విషయాల్లో విద్యార్థులకు అవగాహన కలిగించేందుకు ప్రయత్నిస్తారు.


ఇవి కూడా చదవండి..

పాకిస్థాన్‌తో ప్రపంచకప్ మ్యాచ్.. కుర్రాళ్లతో సచిన్, లక్ష్మణ్ చిట్‌చాట్..


ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Feb 01 , 2026 | 12:03 PM