జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి.. పోలీస్ కానిస్టేబుల్ మృతి..
ABN , Publish Date - Jul 22 , 2026 | 02:23 PM
జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులు జరిపిన ఘటనలో ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు.
ఇంటర్‌నెట్ డెస్క్: జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులు జరిపిన ఘటనలో ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. సంఘటనకు సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు తెలిపిన వివరాల మేరకు.. బుధవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో అనంత్‌నాగ్‌లోని లాల్‌చౌక్‌లో అమరనాథ్ యాత్ర సెక్యూరిటీ డ్యూటీలో ఉన్న పోలీసులపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో హెడ్‌కానిస్టేబుల్ ఆశిఖ్ హుస్సేన్ ఖురేషీ తీవ్రంగా గాయపడ్డారు. తోటి పోలీసులు ఆయనను హుటాహుటిన అనంత్‌నాగ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించారు. ఖురేషీని పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు. ఈ దాడికి బాధ్యత వహిస్తూ ‘ది రెసిస్టన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్)’ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. ఈ నేపథ్యంలో భద్రతా దళాలు అప్రమత్తం అయ్యాయి. దాడికి పాల్పడ్డ టెర్రరిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.
ఇవి కూడా చదవండి
మా సమయాన్ని వృథా చేయకండి.. వీడియోలు చూసే టైమ్ లేదు: సుప్రీంకోర్టు
పురుషుల విషయంలో.. మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు