Share News

పీవోకేలో నేడే భారీ మార్చ్‌

ABN , Publish Date - Jul 15 , 2026 | 06:24 AM

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) రాజధాని ముజఫరాబాద్‌ బుధవారం (15న) భారీ మార్చ్‌కు వేదికగా నిలవబోతోంది. పాక్‌ ప్రభుత్వ అణచివేతను వ్యతిరేకిస్తూ ముజఫరాబాద్‌ ముట్టడికి..

పీవోకేలో నేడే భారీ మార్చ్‌

  • ముజఫరాబాద్‌కు లక్షలాది మంది నిరసనకారులు

  • డిమాండ్లను నెరవేర్చేవరకు తగ్గేదేలే అంటున్న ప్రజలు

  • నిరసనలను అణచివేసేందుకు భారీగా సైనికుల మోహరింపు

  • రావల్‌కోట్‌లో పాక్‌ రేంజర్ల కాల్పులు.. 8 మంది మృతి

న్యూఢిల్లీ, జూలై 14: పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) రాజధాని ముజఫరాబాద్‌ బుధవారం (15న) భారీ మార్చ్‌కు వేదికగా నిలవబోతోంది. పాక్‌ ప్రభుత్వ అణచివేతను వ్యతిరేకిస్తూ ముజఫరాబాద్‌ ముట్టడికి అవామీ యాక్షన్‌ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు కదం తొక్కుతున్నారు. ఆర్థిక, రాజకీయ వివక్షను వ్యతిరేకిస్తూ, హక్కుల కోసం తలపెట్టిన ఈ మార్చ్‌లో లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా పాలొంటున్నారు. సైన్యం సాయంతో ఈ కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేసేందుకు షెహబాజ్‌ షరీఫ్‌ సర్కారు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా.. అక్కడి ప్రజలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. పీవోకే వ్యాప్తంగా ఎక్కడికక్కడే నిరసనకారులను నిలువరించేందుకు 4,000 ట్రూప్‌లు, ఏడు రేజంర్‌ వింగ్‌లను పాక్‌ సైన్యం రంగంలోకి దింపింది. మరోవైపు రావల్‌కోట్‌ బస్టాండ్‌ వద్ద నిరసన కారులపై పాక్‌ రేంజర్లు జరిపిన కాల్పుల్లో 8 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్‌లోని పంజాబ్‌, సింధ్‌ వంటి ప్రాంతాల్లో నివసిస్తున్న శరణార్థుల కోసం పీవోకే అసెంబ్లీలో 12 సీట్లను కేటాయించారు. దీన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. స్థానికేతరులతో తమపై పెత్తనం చలాయించడం.. తమ హక్కులను కాలరాయడమేనని జాక్‌ అంటోంది. దీన్ని రద్దు చేసి 12 సీట్లను స్థానికులకే కేటాయించాలన్నది వారి ప్రధాన డిమాండ్‌. పప్పులు, గోధుమల వంటి నిత్యావసరాలను సబ్సిడీలపై అందించాలన్నది మరో డిమాండ్‌. ఉపాధి అవకాశాలు కల్పించాలని కూడా డిమాండ్‌ చేస్తున్నారు. గత జూన్‌లో శాంతియుత ప్రదర్శనలపై పాక్‌ ఆర్మీ, రేంజర్స్‌ జరిపిన కాల్పుల్లో 20 నుంచి 30 మంది ప్రాణాలు కోల్పోగా, వారి కుటుంబాలకు న్యాయం చేయాలన్న డిమాండ్లతో ఈ భారీ మార్చ్‌ తలపెట్టారు.

ఈ వార్తలు కూడా చదవండి

తిరుగుబాటు ఎంపీలకు శివసేన ( (UBT) లీగల్ నోటీసులు

రామ్ మందిర్ సీఈఓ రేసులో మాజీ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్!

Updated Date - Jul 15 , 2026 | 06:25 AM