Share News

పేపర్‌ లీక్‌ ముఠాలను వదిలిపెట్టం

ABN , Publish Date - Jul 31 , 2026 | 05:26 AM

పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ ముఠాలను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. లీకేజీలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించే బిల్లులను పార్లమెంటులో ఆమోదింపజేసుకోవడం...

పేపర్‌ లీక్‌ ముఠాలను వదిలిపెట్టం

  • ఎలాంటి కనికరం చూపించబోం

  • హామీ ఇచ్చినట్టుగా లీకేజీల

  • నిరోధానికి కఠిన చట్టాన్ని

  • పార్లమెంటులో ఆమోదింపజేశాం

  • సంస్కరణల దిశగా మైలురాయి

  • పరీక్షల వివాదంపై నాలుగో

  • సెల్ఫీ వీడియోలో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, జూలై 30: పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ ముఠాలను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. లీకేజీలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించే బిల్లులను పార్లమెంటులో ఆమోదింపజేసుకోవడం కీలక మైలురాయి అన్నారు. ఈ మేరకు గురువారం రాత్రి 11 గంటల సమయంలో మోదీ మరో వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. జంతర్‌మంతర్‌ నిరసనల తర్వాత ప్రధాని మోదీ విడుదల చేసిన నాలుగో సెల్ఫీ వీడియో ఇది. గత మూడు వీడియోల్లో ఇంగ్లి్‌షలో ‘ఫ్రెండ్స్‌’ అంటూ సంబోధించిన ప్రధాని.. దీనిలో మాత్రం తాను సాధారణంగా ఉపయోగించే హిందీ పదం ‘సాథియో’ అంటూ ప్రారంభించడం గమనార్హం. ‘‘ఎన్నో దశాబ్దాలుగా పేపర్‌ లీక్‌ల సమస్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సవాల్‌గా ఉంది. కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడే ఈ వ్యవహారాన్ని అరికట్టేందుకు నిరంతరం చర్యలు తీసుకుంటున్నాం. పరీక్ష వ్యవస్థలు సంస్కరణలు, ఫాస్ట్‌ ట్రాక్‌ విధానాలు, పక్రియలను పటిష్ఠం చేయడం, సరికొత్త సాంకేతితక వినియోగంతోపాటు రాష్ట్రాల సూచనలను పరిగణనలోకి తీసుకుంటున్నాం. దేశంలోని పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడే పేపర్‌ లీక్‌ ముఠాలు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేవు. ఎలాంటి కనికరం చూపించం. హామీ ఇచ్చినట్టుగా ప్రశ్నపత్రాల లీకేజీల నిరోధం కోసం కఠిన చట్టాలను పార్లమెంటులో విస్తారంగా చర్చించి, ఆమోదింపజేశాం. పరీక్ష వ్యవస్థలో కీలక సంస్కరణల దిశగా ఇదొక మైలురాయి. ఇకపై లీకేజీల ఘటనలు జరగకుండా ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపడుతుంది. అభివృద్ధి చెందిన భారత్‌ కలలను నెరవేర్చుకునే దిశగా అంతా ఏకతాటిపైకి రావాలి’’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

ఈ వార్తలనూ చదవండి:

కువైట్‌లోని చైనా కంపెనీపై ఇరాన్ దాడి

కుట్రపూరిత వీసా కేసు.. అమెరికా నుంచి భారతీయుడి బహిష్కరణ

Updated Date - Jul 31 , 2026 | 05:26 AM