అంతిమ విజయం సత్యానిదే: ప్రధాని మోదీ
ABN , Publish Date - Sep 08 , 2026 | 02:27 PM
అసత్యాల ప్రతిధ్వనిని సత్యం జయిస్తుందని ప్రధాని మోదీ తాజాగా వ్యాఖ్యానించారు. వడోదరలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ యువతను ఉద్దేశించి మాట్లాడారు.
ఇంటర్నెట్ డెస్క్: అసత్యాల ప్రతిధ్వనిని సత్యం జయిస్తుందని ప్రధాని మోదీ తాజాగా వ్యాఖ్యానించారు. గుజరాత్‌లోని వడోదరలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ యువతను ఉద్దేశించి మాట్లాడారు. అసత్యాల ప్రతిధ్వనుల ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. కానీ భారత దేశ యువత మాత్రం సత్యమార్గంలో ప్రయాణిస్తోందని చెప్పారు. తప్పుదారి పట్టించే వారు ప్రతి చోటా తారసపడుతూనే ఉంటారని అన్నారు. అంతకుముందు ప్రధాని వడోదరలో రూ.20 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు.
ఈ సభకు పెద్ద ఎత్తున హాజరైన గుజరాత్ యువతను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ‘ఇటీవలే వడోదర, ముంబై మధ్య డబుల్ డెకర్ గూడ్స్ రైలు ప్రారంభమైంది. ఈ రైలు ద్వారా ఒక్క ట్రిప్‌లో 250 ట్రక్కులకు సమానమైన సరకును తరలించవచ్చు. ఇలాంటి సందర్భాల్లో కూడా కొందరు ఎంట్రీ ఇచ్చి విమర్శలు గుప్పిస్తారు. ట్రక్ డ్రైవర్ల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తారు. ట్రక్కుల పరిస్థితి ఏమిటని అంటారు. వాళ్లకు గొణిగేందుకు మరో అంశం దొరికినట్టే’ అని ప్రతిపక్షాలకు చురకలు అంటించారు. 2014కు ముందు సరకు రవాణా ప్రత్యేక కారిడార్ నిర్మాణం కిలోమీటరు మేర కూడా ముందుకు సాగలేదని విమర్శించారు.
ఈ వార్తలనూ చదవండి:
రీల్స్‌కు బానిసగా మారి.. ఇంటర్‌నెట్ లేదని మహిళ ఆత్మహత్య..
పరువునష్టం కేసులో రాహుల్‌కు ఎదురుదెబ్బ.. పిటిషన్ కొట్టివేసిన బాంబే కోర్టు