రీల్స్‌కు బానిసగా మారి.. ఇంటర్‌నెట్ లేదని మహిళ ఆత్మహత్య..
ABN , Publish Date - Sep 08 , 2026 | 01:14 PM
రీల్స్ చూడ్డానికి బానిసైన ఓ మహిళ మొబైల్‌లో ఇంటర్‌నెట్ సరిగా రావటం లేదని తీవ్ర మనోవేదనకు గురైంది. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
ఇంటర్‌నెట్ డెస్క్: రీల్స్ చూడ్డానికి బానిసైన ఓ మహిళ మొబైల్‌లో ఇంటర్‌నెట్ సరిగా రావటం లేదని తీవ్ర మనోవేదనకు గురైంది. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్‌లో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కోర్బా జిల్లా, కేరాకచ్చర్ గ్రామానికి చెందిన మంగ్లో బాయ్ సారధి అనే మహిళ రీల్స్ చూడ్డానికి బానిసైంది. ప్రతీరోజు గంటలు, గంటలు రీల్స్ చూస్తూ గడిపేది. శనివారం రీల్స్ చూస్తున్న సమయంలో ఇంటర్‌నెట్ సమస్య తలెత్తింది. రీల్స్ ఎక్కువ సేపు బఫర్ అవ్వసాగాయి.
దీంతో అసహనానికి గురైన సారధి తన మొబైల్ ఫోన్‌ను విసిరి కొట్టింది. ఆ తర్వాత పురుగుల మందు తాగింది. సారధి కూతురు ఇది గమనించి కుటుంబసభ్యులకు చెప్పింది. వారు సారధిని కర్తాలా ప్రైమరీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అక్కడినుంచి ఆమెను కోర్బా మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ సోమవారం సారధి కన్నుమూసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబానికి అందజేశారు.
ఇవి కూడా చదవండి
కేసీఆర్ చావును కోరుకుంటున్న సీఎం రేవంత్: వేముల ప్రశాంత్ రెడ్డి
స్పీకర్ కంటతడి దృశ్యాలపై రేవంత్ ఆవేదన.. ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ