ఇంటింటా త్రివర్ణ పతాకం!
ABN , Publish Date - Aug 12 , 2026 | 07:29 AM
స్వాతంత్య్ర దినోత్సవాన్ని సగర్వంగా, సగౌరవంగా, అందరూ మెచ్చుకునేలా జరుపుకోవాలని భారత ప్రజలకు ప్రధాని మోదీ పిలుపిచ్చారు. ఈ మేరకు మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో...
ప్రతి మనసులో మువ్వన్నెల జెండా: ప్రధాని.. సగర్వంగా స్వాతంత్య్ర వేడుకలు జరుపుకోండి
ప్రగతిశీల భారతానికి ప్రతిన పూనండి
ఎన్‌డీఏ ఎంపీల భేటీలో మోదీ పిలుపు
న్యూఢిల్లీ, ఆగస్టు 11: స్వాతంత్య్ర దినోత్సవాన్ని సగర్వంగా, సగౌరవంగా, అందరూ మెచ్చుకునేలా జరుపుకోవాలని భారత ప్రజలకు ప్రధాని మోదీ పిలుపిచ్చారు. ఈ మేరకు మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో సందేశం పోస్టు చేశారు. ‘మన స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పిద్దాం. భారత అభివృద్ధికి ప్రతినబూనుదాం. ఇంటింటా మువ్వన్నెల పతాకం ఎగురవేద్దాం.. ప్రతి మనసులో త్రివర్ణ పతాకం ప్రతిష్టించుకుందాం. భారత్ మాతా కీ జై.. వందేమాతరం’ అని మూడుసార్లు ఆయన నినదించారు. అందులో మంగళవారం ఉదయం పార్లమెంటు ప్రాంగణంలోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో జరిగిన ఎన్‌డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం వీడియోను కూడా తన పోస్టుకు జతచేశారు. ఆ భేటీకి ఆయన వస్తుండగా.. కేంద్ర మంత్రులు, ఎన్‌డీఏ ఎంపీలు త్రివర్ణ పతాకాన్ని ఊపుతూ.. ‘వందేమాతరం, భారత్ మాతా కీ జై’ అనే నినాదాలతో స్వాగతించారు. ఆయన కూడా మువ్వన్నెల జెండాను పట్టుకుని ఊపుతూ ఎంపీల ముందుకు సాగారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ప్రతి వారం ఎన్‌డీఏ పార్లమెంటరీ పార్టీ ‘మంగళ్ మిలాన్’ సమావేశం జరుపుతున్న సంగతి తెలిసిందే. మంగళవారంనాటి భేటీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు అమిత్‌షా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, శివరాజ్‌సింగ్ చౌహాన్, ఎస్.జైశంకర్, మిత్రపక్షాలకు చెందిన మంత్రులు హెచ్‌డీ కుమారస్వామి (జేడీఎస్), కె.రామ్మోహన్‌నాయుడు (టీడీపీ), రాందాస్ అథావలే (ఆర్‌ఎ్‌సపీ-ఏ), ప్రఫుల్ పటేల్ (ఎన్‌సీపీ), ఉపేంద్ర కుశ్వాహా (ఆర్‌ఎల్‌ఎం), శతాబ్ది రాయ్ (ఎన్‌సీపీఐ) తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్.. తన శాఖకు సంబంధించిన వివిధ అంశాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు గురువారంతో ముగియనున్న సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి
భారతమాతకు ధైర్యవంతుడైన కుమారుడు ఖుదీరామ్ బోస్: పవన్ కల్యాణ్
నా హక్కుల కోసం పోరాడాను.. అదే నేను చేసిన తప్పు: హర్భజన్ సింగ్