Share News

నన్ను పడేసినవారే.. లేవడం నేర్పారు!

ABN , Publish Date - Oct 08 , 2026 | 01:29 AM

తనను కింద పడేసినవారే మళ్లీ లేవడం నేర్పారని..తనను వ్యతిరేకించిన వారే ప్రజాస్వామ్య శక్తిని అర్థమయ్యేలా చేశారని ప్రధాని మోదీ చెప్పారు.

నన్ను పడేసినవారే.. లేవడం నేర్పారు!
narendramodi with advani

  • విమర్శించినవారు ఆత్మ పరిశీలన శక్తి ఇచ్చారు: మోదీ

న్యూఢిల్లీ, అక్టోబరు 7: తనను కింద పడేసినవారే మళ్లీ లేవడం నేర్పారని..తనను వ్యతిరేకించిన వారే ప్రజాస్వామ్య శక్తిని అర్థమయ్యేలా చేశారని ప్రధాని మోదీ చెప్పారు. ప్రతి సంక్షోభం తన సహనాన్ని పరీక్షించిందని..ప్రతి విజయం బాధ్యతలను పెంచడంతోపాటు మరింత గొప్ప లక్ష్యాల దిశగా సాగేందుకు తగిన ధైర్యాన్ని, దృఢ సంకల్పాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. గుజరాత్‌ సీఎంగా, ప్రధానిగా తన పాతికేళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకొని బుధవారం ఢిల్లీలో నిర్వహించిన ‘వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ సభ’లో మోదీ ప్రసంగించారు. ‘‘నాపై నమ్మకం ఉంచిన ప్రజలందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నా. నేను నిత్య విద్యార్థిని. నా ఉపాధ్యాయులు వినయాన్ని నేర్పించారు. నన్ను కింద పడేసినవారు తిరిగి ఎలా లేవాలో నేర్పించారు. నా మద్దతుదారులు నన్ను ప్రోత్సహిస్తే, విమర్శకులు ఆత్మపరిశీలన చేసుకోవడం నేర్పించారు’ అని మోదీ తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి

శివరాజ్‌కుమార్‌కు తప్పిన ప్రమాదం.. ముఖానికి అతి సమీపాన పేలిన టపాసులు

ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం..

Updated Date - Oct 08 , 2026 | 01:30 AM