Share News

ఎరువుల కొరత రాకుండా చూడాలి

ABN , Publish Date - Mar 23 , 2026 | 07:29 AM

పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం దేశ ఆర్థిక వ్యవస్థపై చూపిస్తున్న ప్రభావంపై ప్రధాని మోదీ ఆదివారం ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. సామాన్యులకు అత్యవసరమైన...

ఎరువుల కొరత రాకుండా చూడాలి

  • పశ్చిమాసియాలో యుద్ధంపై సమీక్షలో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, మార్చి 22: పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం దేశ ఆర్థిక వ్యవస్థపై చూపిస్తున్న ప్రభావంపై ప్రధాని మోదీ ఆదివారం ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. సామాన్యులకు అత్యవసరమైన ఆహారం, ఇంధనం, గ్యాస్‌ వంటి కీలక వనరుల లభ్యతపై కూలంకషంగా చర్చలు జరిపారు. దేశ భద్రత, వ్యూహాత్మక అంశాలపై నిర్ణయాలు తీసుకునే కేబినెట్‌ కమిటీ ఆన్‌ సెక్యూరిటీ (సీసీఎ్‌స)లో వివిధ అంశాలపై సవివరంగా చర్చించారు. ప్రధాని అధ్యక్షత వహించిన ఈ కమిటీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, హోం మంత్రి అమిత్‌ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జయ్‌శంకర్‌లు సభ్యులుగా ఉన్నారు. పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు మంత్రులు, కార్యదర్శులతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేయాలని ప్రధాని సూచించారు. ఖరీప్‌ సీజన్‌లో రసాయన ఎరువుల లభ్యతపై మదింపు వేశారు. గత కొన్నేళ్లుగా సకాలంలో కావలసినంత ఎరువులు అందజేస్తుండడం, తగినన్ని నిల్వలు ఉండడంపైనా చర్చించారు. భవిష్యత్తులో ప్రత్యామ్నాయ మార్గాల్లో ఎరువులు తీసుకువచ్చి కొరత రాకుండా చూడాలని నిర్ణయించారు. విద్యుత్తు ఉత్పాదన కేంద్రాలకు తగినంతగా బొగ్గు సరఫరా చేసి కరెంటు కొరత లేకుండా చూడాలని మరో నిర్ణయం తీసుకున్నారు. కొత్త ప్రాంతాలకు భారతీయ సరకులను ఎగుమతి చేయాలని నిర్ణయించారు.

ఇవి కూడా చదవండి

ప్రధాని మోదీ అరుదైన రికార్డ్.. అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు

ఐపీఎల్ 2026: వారి బ్యాటింగ్ అదుర్స్.. కానీ టైటిల్ మాత్రం గెలవడం కష్టం: రాబిన్ ఉతప్ప

Updated Date - Mar 23 , 2026 | 07:29 AM