వీర్ సావర్కర్ జయంతి.. ఆయన ధైర్యం, దేశభక్తి ఎప్పటికీ స్ఫూర్తిదాయకం: ప్రధాని
ABN , Publish Date - May 28 , 2026 | 09:47 AM
స్వాతంత్య్ర సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ నివాళులర్పించారు. సావర్కర్ పోరాట జీవితం రాబోయే తరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
న్యూఢిల్లీ, మే 28: భారత స్వాతంత్య్ర సమరయోధుడు, సామాజిక సంస్కర్త వినాయక్ దామోదర్ సావర్కర్ (వీర్ సావర్కర్) జయంతి (మే 28) సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఇవాళ ఘనంగా నివాళులర్పించారు. సావర్కర్ చూపిన అసమాన ధైర్యసాహసాలు, అచంచలమైన దేశభక్తి, సామాజిక సంస్కరణల పట్ల ఆయనకున్న శ్రద్ధ రాబోయే తరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ప్రధాని కొనియాడారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం 'X' వేదికగా ప్రధాని మోదీ స్పందిస్తూ.. 'వీర్ సావర్కర్ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటున్నాను. ఆయన ధైర్యం, దేశభక్తి ప్రజల్లో ఎల్లప్పుడూ స్ఫూర్తిని నింపుతాయి. ఆయన మేధోశక్తి, సామాజిక సంస్కరణలపై ఆయన చూపిన శ్రద్ధ దిక్సూచీ వంటిది' అని పేర్కొన్నారు.
దేశభక్తికి నిలువెత్తు రూపం: అమిత్ షా
కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం వీర సావర్కర్‌కు ఘన నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు. 'మాతృభూమి విముక్తి కోసం తన జీవితాన్ని ధారపోసిన నిర్భయ యోధుడు వీర సావర్కర్. ఆయన జీవితం, రచనల ద్వారా దేశం పట్ల అచంచలమైన భక్తిని, సిద్ధాంతాన్ని మనం నేర్చుకోవచ్చు. 'ఓ మాతృభూమీ! పుట్టుక నుంచి చావు వరకు నేను నీవాడినే' అన్న ఆయన మాటలు దేశం పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమకు నిదర్శనం' అని అమిత్ షా పేర్కొన్నారు. అస్పృశ్యత లాంటి సామాజిక జాడ్యాలకు వ్యతిరేకంగా సావర్కర్ చేసిన పోరాటం, సామాజిక ఐక్యత కోసం ఆయన పడిన తపన రాబోయే తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని హోం మంత్రి స్పష్టం చేశారు.
అణచివేతకు లొంగని తత్వం: రాజ్‌నాథ్ సింగ్
కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాళులర్పిస్తూ.. సావర్కర్ కేవలం ఒక జాతీయవాద ఆలోచనాపరుడే కాకుండా గొప్ప వక్త, కవి, తత్వవేత్త అని కొనియాడారు. బ్రిటీష్ ప్రభుత్వ హయాంలో ఎన్నో అమానుష చిత్రహింసలను అనుభవించినప్పటికీ, భారతదేశ స్వాతంత్య్రం కోసం ఆయన తన సర్వస్వాన్ని అర్పించారని గుర్తుచేశారు.
అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వీర సావర్కర్‌ను 'భారతమాత అమరపుత్రుడు' గా అభివర్ణించారు. దేశ స్వాతంత్య్రం కోసం కఠినమైన, అమానవీయమైన జైలు శిక్షలను భరించి, తన జీవితాన్ని మాతృభూమి చరణాలకు అర్పించిన సావర్కర్ విప్లవాత్మక స్పృహ, పోరాట జీవితం దేశ ప్రయోజనాల కోసం అంకితభావంతో, ధైర్యంతో పనిచేయాలనే అమూల్యమైన సందేశాన్ని అందిస్తూనే ఉంటాయని అన్నారు.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి నివాళి:
ఈ వార్తలనూ చదవండి:
అమెరికా మంత్రి సాహసం.. చేతిపై కాటేసిన పాము.. వీడియో వైరల్..
పాక్ మధ్యవర్తిత్వమే అతి పెద్ద సమస్య: అమెరికా సెనెటర్