వీఐటీ చెన్నై’ ఏఐ హెల్త్‌కేర్ టెక్నాలజీకి ప్రధాని ప్రశంస
ABN , Publish Date - Oct 15 , 2026 | 03:39 AM
‘వేలూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ) చెన్నై’లో ఇంక్యుబేట్ చేసిన హెల్త్‌కేర్ డీప్-టెక్ స్టార్ట్‌ప..‘మెడ్ ఎక్స్ ఏఐ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అభివృద్ధి చేసిన ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలను ప్రధానిమోదీ ప్రత్యేకంగా ప్రశంసించారు.
చెన్నై, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): ‘వేలూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ) చెన్నై’లో ఇంక్యుబేట్ చేసిన హెల్త్‌కేర్ డీప్-టెక్ స్టార్టప్..‘మెడ్ ఎక్స్ ఏఐ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అభివృద్ధి చేసిన ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలను ప్రధానిమోదీ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇటీవల చెన్నై వచ్చిన ప్రధాని.. సీఎం విజయ్ సమక్షంలో పోరూర్ మెట్రోరైల్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మెడ్ ఎక్స్ ఏఐ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ షీనా సి.ప్రవీణ్ బృందంతో సంభాషించారు.కంపెనీ రెండు ప్రధాన టెక్నాలజీ ప్లాట్‌ఫారాలైన ‘సెర్విలెన్స్’, క్వాంటం ఫార్మ్ ఎక్స్‌లను వివరించారు. వైద్య నిర్ధారణ, తదుపరితరం ఔషధ ఆవిష్కరణలను అభివృద్ధి చేయడానికి తమ సంస్థ రూపొందించిన ఏఐ, క్వాంటం కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్ పరిష్కారాలను కూడా వివరించారు. అన్నింటినీ ఆలకించిన ప్రధాని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆ స్టార్ట్‌పను, ఉత్పత్తులను ప్రధాని ప్రశంసించడం ప్రోత్సాహకంగా ఉందని నిర్వాహకులు ప్రకటనలో పేర్కొన్నారు. మెడ్ ఎక్స్ ఏఐ ఇన్నోవేషన్స్ అనేది ఆరోగ్య సంరక్షణ, ఫార్మాస్యూటికల్ పరిశోధనల్లోని కీలక సవాళ్లను పరిష్కరించడానికి స్వదేశీ ఏఐ, క్వాంటం కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్ పరిష్కారాలను అభివృద్ధి చేస్తున్న ఒక హెల్త్‌కేర్ డీప్-టెక్ కంపెనీ. ఈ కంపెనీని వీఐటీ చెన్నైలోని స్కూల్ ఆఫ్ ఎలకా్ట్రనిక్స్ ఇంజనీరింగ్ ఫ్యాక్టల్టీ అయిన డాక్టర్ షీనా సి.ప్రవీణ్, డాక్టర్ రీనా మోనికా (చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్) స్థాపించారు. ఈ వ్యవస్థను పెంపొందించడంలో నిరంతర మద్దతు, ప్రోత్సాహం అందిస్తున్నందుకు వీఐటీ వ్యవస్థాపకులు చాన్స్‌లర్ డాక్టర్ విశ్వనాధన్‌కు, ఉపాధ్యక్షుడు డాక్టర్ జీవీ సెల్వంకు మెడ్ ఎక్స్ ఏఐ ఇన్నోవేషన్స్ కృతజ్ఞతలు తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి
విదేశాల్లో భారతీయుల భద్రతకు కట్టుబడి ఉన్నాం.. కేంద్రం స్పష్టీకరణ
తనపై లైంగిక ఆరోపణలు చేసిన మహిళా, సీజేపీ నేతలపై ఏసీపీ ఫిర్యాదు!