వెనెజువెలాలో భారత వైద్యుల సేవల్ని కొనియాడిన ప్రధాని మోదీ
ABN , Publish Date - Jul 01 , 2026 | 01:08 PM
భూకంపంతో అతలాకుతలమైన వెనెజువెలాలో మానవతా దృక్పథంతో భారత్ చేపట్టిన'ఆపరేషన్ అమిస్తాద్'లో అహర్నిశలు శ్రమిస్తున్న భారతీయ వైద్య బృందాలు, సైనిక వైద్యులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు.
ఢిల్లీ, జూలై 1: భూకంపంతో అతలాకుతలమైన వెనెజువెలాలో మానవతా దృక్పథంతో భారత్ చేపట్టిన 'ఆపరేషన్ అమిస్తాద్' (Operation Amistad)లో అహర్నిశలు శ్రమిస్తున్న భారతీయ వైద్య బృందాలు, సైనిక వైద్యులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. జాతీయ వైద్యుల దినోత్సవం (Doctors' Day) సందర్భంగా ఇవాళ ప్రధాని 'X' వేదికగా వైద్యులకు అభినందనలు తెలిపారు.
సమాజం ఎదుర్కొనే ఎలాంటి సవాలునైనా అధిగమించడంలో వైద్య నిపుణులు ఎల్లప్పుడూ ముందుంటారనే దానికి వెనెజువెలాలో మన వైద్యులు చేస్తున్న సేవలే నిదర్శనమని ప్రధాని కొనియాడారు. నేడు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా దేశంలో వైద్య సేవల అభివృద్ధికి తీసుకుంటోన్న చర్యల్ని ఈ సందర్భంగా ప్రధాని వివరించారు.