Share News

‘నషా ముక్త్ యువ’ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని

ABN , Publish Date - Aug 02 , 2026 | 04:22 PM

యువతకు డ్రగ్స్ పీడ వదిలించే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ ‘నషా ముక్త యువ’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండేలా యువతలో స్ఫూర్తి నింపేందుకు ఒక సమగ్ర ప్రచారకార్యక్రమంగా ‘నషా ముక్త యువ’ను ప్రారంభించామని ప్రధాని తెలిపారు.

‘నషా ముక్త్ యువ’ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని
PM Modi Launches Nasha Mukti Yuva Campaign

ఇంటర్నెట్ డెస్క్: యువతకు డ్రగ్స్ పీడ వదిలించే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ నషా ముక్త యువ కార్యక్రమాన్ని ప్రారంభించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండేలా యువతలో స్ఫూర్తి నింపేందుకు ఒక సమగ్ర ప్రచారకార్యక్రమంగా ‘నషా ముక్త యువ’ను ప్రారంభించామని ప్రధాని తెలిపారు. తాముంటున్న ప్రాంతాల్లో సానుకూల మార్పులకు కారకులుగా యువత నిలవాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చామని ప్రధాని చెప్పారు.

‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని సాకారం చేసుకునేందుకు దేశ యువత ఆరోగ్యంగా ఉండటం అవసరమని ప్రధాని అన్నారు. ఈ కార్యక్రమం వ్యక్తులకే కాకుండా కుటుంబాలు, దేశ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని రూపొందించామని అన్నారు. గతేడాది కాశీలో పైలట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయాన్ని ప్రధాని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది దేశవ్యాప్తంగా అమలయ్యే స్థాయికి విస్తరించిందని చెప్పారు. ఈ క్యాంపెయిన్‌లో 125 ఆధ్యాత్మిక సంస్థలు కూడా చేరాయని చెప్పారు. డ్రగ్స్ రహిత సమాజం దిశగా కృషి చేస్తున్నాయని అన్నారు.


‘కొన్ని పనులను పూర్తి చేసేందుకు ఒక వ్యక్తి సామర్థ్యం సరిపోదు. ఇలాంటి విషయాల్లో ఒంటరిపోరాటంతో అలసట, నిస్ఫృహ ఆవరిస్తాయి. కానీ అనేక మంది కలికట్టుగా రంగంలోకి దిగితే ఆ ఐక్యత నుంచి స్ఫూర్తి పొంది లక్ష్యాన్ని సాధించవచ్చు’ అని ప్రధాని అన్నారు. ఇప్పటికే లక్షలాది మంది యువత ఇక డ్రగ్స్ జోలికి వెళ్లబోమని ప్రతినబూనారని చెప్పారు.

ఈ కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్‌తో కలిగే ముప్పుపై ప్రచార కార్యక్రమాలను దేశవ్యాప్తంగా ప్రతి ఆదివారం నిర్వహించనున్నారు. దీంతో, పాటు యువతలో ఆత్మస్థైర్యం, క్రమశిక్షణ పెంపొందించేందుకు రకరకాల క్రీడా కార్యక్రమాలు, వాకథాన్‌లు, సాంస్కృతిక కార్యక్రమాలు, చర్చలతో పాటు సామాజిక స్థాయిలో కూడా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

మాజీ ఎంపీని పార్టీ నుంచి బహిష్కరించిన బీఎస్పీ చీఫ్ మాయావతి

క్షమించి నా కూతురికి జీవనదానం చేశారు.. ప్రధాని మోదీకి బాలిక తల్లి కృతజ్ఞతలు..

Updated Date - Aug 02 , 2026 | 04:33 PM