Share News

మాజీ ఎంపీని పార్టీ నుంచి బహిష్కరించిన బీఎస్పీ చీఫ్ మాయావతి

ABN , Publish Date - Aug 02 , 2026 | 03:24 PM

బీఎస్పీ నేత, రాజ్యసభ మాజీ ఎంపీ అశోక్ సిద్ధార్థ్‌ను అధినేత్రి మాయవతి పార్టీ నుంచి ఆదివారం బహిష్కరించారు. పార్టీ కోఆర్డినేటర్ రణధీర్ బేనీవాల్‌ను కూడా బహిష్కరించారు.

మాజీ ఎంపీని పార్టీ నుంచి బహిష్కరించిన బీఎస్పీ చీఫ్ మాయావతి
BSP Chief Mayawati Expels former RS MP

ఇంటర్నెట్ డెస్క్: రాజ్యసభ మాజీ ఎంపీ అశోక్ సిద్ధార్థ్‌ను బీఎస్పీ అధినేత్రి మాయవతి పార్టీ నుంచి ఆదివారం బహిష్కరించారు. పార్టీ కోఆర్డినేటర్ రణధీర్ సింగ్‌ బేనీవాల్‌పై కూడా బహిష్కరణ వేటు వేశారు. పార్టీ మార్గదర్శకాలను పలుమార్లు ఉల్లంఘించడం, క్రమశిక్షణారాహిత్యం కారణాలతో వారిని తొలగించారు. ఎక్స్ వేదికగా బీఎస్పీ అధినేత్రి ఈ విషయాలను వెల్లడించారు.


సిద్ధార్థ్‌ను గతంలో ఒకసారి బహిష్కరించిన విషయాన్ని బీఎస్పీ చీఫ్ మాయావతి ఎక్స్ వేదికగా వెల్లడించారు. మహారాష్ట్ర అసెంబ్లీలో టికెట్ పంపిణీ విషయంలో రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్‌తో సమన్వయం చేసుకోనందుకు బహిష్కరించామని చెప్పారు. మరోసారి ఇలాంటివి జరగవని సిద్ధార్థ్ హామీ ఇవ్వడంతో పార్టీలోకి మళ్లీ అనుమతించామని అన్నారు. ఆ తరువాత పార్టీకి సంబంధించి పలు బాధ్యతలను అప్పగించామని చెప్పారు. కానీ కర్ణాటక, ఒడిశా, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో బీఎస్పీ మార్గదర్శకాలను సిద్ధార్థ్ మళ్లీ ఉల్లంఘిచారని మాయావతి చెప్పారు. దీంతో, శనివారం ఆయనను పార్టీకి చెందిన అన్ని బాధ్యతల నుంచి తప్పించామని తెలిపారు.

అయితే, సిద్ధార్థ్ మళ్లీ యూపీకి తిరిగొస్తున్నారన్న వార్తలు వ్యాపించాయని, పార్టీలో కార్యకలాపాలకు అడ్డంకులు సృష్టించేందుకు కుట్ర జరిగిందని ఆరోపించారు. కాబట్టి పార్టీ ప్రయోజనాల దృష్ట్యా తక్షణం ఆయనను పార్టీ నుంచి బహిష్కరించామని చెప్పారు. మమత మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌కు సిద్ధార్థ్ మామ అన్న విషయం తెలిసిందే.


పార్టీ కోఆర్డినేటర్ బేనీవాల్‌కు కూడా క్రమశిక్షణ లేని కారణంగా పార్టీ నుంచి బహిష్కరించామని బీఎస్పీ చీఫ్ మాయావతి చెప్పారు. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ బాధ్యతలను గతంలో ఆయనకు అప్పగించామని అన్నారు. కానీ ఆయన పార్టీ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ క్రమశిక్షణారాహిత్యం ప్రదర్శిస్తున్నట్టు తరచూ ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. కాబట్టి, పార్టీ ప్రయోజనాలను కాపాడుకునేందుకు బేనీవాల్‌ను కూడా బహిష్కరించామని తెలిపారు.


ఈ వార్తలనూ చదవండి:

మెరుగైన జీవితం కోసం వెళ్లి మృత్యువాత పడ్డారు: కుటుంబ సభ్యులు

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కుట్ర.. ప్రియురాలి సోషల్ మీడియాతో దొరికిపోయిన ఉగ్రవాది!

Updated Date - Aug 02 , 2026 | 04:32 PM