Share News

ప్రధాని మోదీకి అరుదైన గౌరవం.. ఇజ్రాయెల్ పార్లమెంటు భవనం త్రివర్ణ మయం.!

ABN , Publish Date - Feb 25 , 2026 | 12:21 PM

రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్‌కు బయలుదేరి వెళ్లారు. ఎయిర్‌పోర్ట్‌లో మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆయన సతీమణి సారా స్వాగతం పలకనున్నారు.

ప్రధాని మోదీకి అరుదైన గౌరవం.. ఇజ్రాయెల్ పార్లమెంటు భవనం త్రివర్ణ మయం.!
PM Modi Israel visit 2026

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం ఉదయం ఇజ్రాయెల్‌కు బయల్దేరి వెళ్లారు. ఎయిర్‌పోర్ట్‌లో మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆయన సతీమణి సారా స్వాగతం పలుకనున్నారు. ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికేందుకు యావత్ ఇజ్రాయెల్‌ సన్నద్ధమైంది. ప్రధాని మోదీ రాకను ప్రకటిస్తూ, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. మోదీని తన స్నేహితుడిగా అభివర్ణించారు.


ఈ రెండు రోజుల్లో ప్రధాని మోదీ అనేక ముఖ్యమైన రక్షణ, వ్యూహాత్మక అంశాలపై చర్చిస్తారు. తన పర్యటనలో మొదటి రోజు(బుధవారం) మోదీ.. నెతన్యాహుతో ప్రైవేట్ విందులో పాల్గొంటారు. అనంతరం ఇజ్రాయెల్ పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇరుదేశాల స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్‌నకు మోదీ పర్యటన ముందడుగుగా నిలుస్తుందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

అమానుషం.. మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై..

ఢిల్లీలో కాల్పుల కలకలం.. లారెన్స్ బిష్ణోయ్ లీగల్ టీమ్‌పై అటాక్

Updated Date - Feb 25 , 2026 | 12:59 PM