Share News

'హర్ ఘర్ తిరంగా' ఉద్యమంలో ప్రజలందరూ పాల్గొనాలి: ప్రధాని

ABN , Publish Date - Aug 09 , 2026 | 09:32 PM

80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, దేశవ్యాప్తంగా నిర్వహించనున్న 'హర్ ఘర్ తిరంగా' ఉద్యమంలో ప్రజలందరూ ఉత్సాహంగా పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

'హర్ ఘర్ తిరంగా' ఉద్యమంలో ప్రజలందరూ పాల్గొనాలి: ప్రధాని
PM Modi Urges People to Join Har Ghar Tiranga Movement Ahead of Independence Day

ఢిల్లీ, ఆగస్టు 9: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, దేశవ్యాప్తంగా నిర్వహించనున్న 'హర్ ఘర్ తిరంగా' ఉద్యమంలో ప్రజలందరూ ఉత్సాహంగా పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ ఏడాది 'హర్ ఘర్ తిరంగా' ప్రచారానికి ఒక ప్రత్యేకత ఉందనని ప్రధాని మోదీ అన్నారు. మన జాతీయ గేయం 'వందేమాతరం' 150 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ ఏడాది వేడుకలను అంకితం చేస్తున్నట్లు తెలిపారు.


మన మువ్వన్నెల జెండా మన గర్వకారణం.. వికసిత భారత్ నిర్మాణానికి మనమంతా కలిసికట్టుగా పునరంకితం కావడానికి ఈ ఉద్యమంలో పాల్గొందామని ప్రధాని సామాజిక మాధ్యమం 'ఎక్స్' (X) వేదికగా పిలుపునిచ్చారు.


'హర్ ఘర్ తిరంగా'లో భాగంగా పౌరులందరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి, ఆ ఫోటోలను (సెల్ఫీలను) harghartiranga.com వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది.


దేశవ్యాప్తంగా జిల్లాలు, బ్లాకులు, పంచాయతీ స్థాయిల్లో తిరంగా ర్యాలీలు, బైక్/సైకిల్ ర్యాలీలు, మువ్వన్నెల వెలుగులతో ప్రముఖ భవనాల అలంకరణలు, కాన్సర్ట్‌లు, రంగోలీ పోటీలు నిర్వహించనున్నారు.


సూర్యపథ్ తిరంగా: ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణగా విశ్వవ్యాప్తంగా ఉన్న భారతీయులను ఏకం చేస్తూ తొలిసారిగా 'సూర్యపథ్ తిరంగా' (Suryapath Tiranga) వేడుకలను నిర్వహించనున్నారు.


కలిసి పాడుదాం 'వందేమాతరం': 'తిరంగా సెల్యూట్ టు ది స్పిరిట్ ఆఫ్ వందేమాతరం' థీమ్‌తో భారీ ఎత్తున 'వందేమాతరం' సమూహ గానం, 'సెల్ఫీ విత్ తిరంగా' కార్యక్రమాలు చేపట్టనున్నారు.


2022లో 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' కింద ప్రారంభమైన ఈ 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమం ద్వారా జాతీయ జెండాతో ప్రతి పౌరుడికి వ్యక్తిగత అనుబంధాన్ని పెంచడమే కాకుండా, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం దీని ముఖ్య ఉద్దేశం. ఇప్పటికే ఉత్తరాఖండ్, సిక్కిం, మణిపూర్ వంటి అనేక రాష్ట్రాల్లో తిరంగా యాత్రలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆదివాసీల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం: సీఎం చంద్రబాబు

భాగ్యనగర మహిళలకు బోనాల పండుగ శుభాకాంక్షలు: కేటీఆర్

Updated Date - Aug 09 , 2026 | 09:56 PM