Share News

సైబర్ ఫ్రాడ్‌ను అడ్డుకునేందుకు అంతర్జాతీయ వ్యవస్థ కావాలి: ప్రధాని మోదీ

ABN , Publish Date - Oct 08 , 2026 | 12:45 PM

సైబర్ మోసాలను అడ్డుకునేందుకు అంతర్జాతీయ స్థాయి వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

సైబర్ ఫ్రాడ్‌ను అడ్డుకునేందుకు అంతర్జాతీయ వ్యవస్థ కావాలి: ప్రధాని మోదీ
PM modi in IMC

ఇంటర్నెట్ డెస్క్: సైబర్ మోసాలను అడ్డుకునేందుకు అంతర్జాతీయ స్థాయి వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇలాంటి మోసాలు ఏ ఒక్కదేశానికీ పరిమితం కావని, వీటికి సరిహద్దులు అడ్డుకాదని చెప్పారు. న్యూఢిల్లీలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) సమావేశాలను నేడు ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ భద్రత కోసం ఆర్థిక సంస్థలు, టెలికం కంపెనీలు, నియంత్రణ సంస్థలు కలిసి పనిచేయాలని సూచించారు. నేరాలను మూలాల వద్దే అరికట్టాలని చెప్పారు. పౌరులకు చేరే దాకా ఆగకూడదని స్పష్టం చేశారు.


ప్రధాని తన ప్రసంగానికి ముందు బాలీవుడ్ నటుడు నానా పటేకర్ మృతిపై సంతాపం తెలిపారు. అనంతరం తన ప్రసంగాన్ని కొనసాగించారు. 2022 ఐఎంసీ సమావేశంలో 5జీని లాంఛ్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఆ సాంకేతికత ప్రతి జిల్లాకు చేరిందని చెప్పారు. ప్రస్తుతం భారత్‌ 5జీ నెట్‌వర్క్‌కు 5.5 లక్షల బేస్ స్టేషన్లు పునాదిగా ఉన్నాయని చెప్పారు. 2022తో పోలిస్తే మొబైట్ ఇంటర్నెట్ వేగం 10 రెట్ల మేర పెరిగిందని చెప్పారు. ఈ ప్రయాణంలో ఐఎంసీ కీలక పాత్ర పోషించిందని కొనియాడారు.

దశాబ్దం క్రితం భారత్‌లో డిజిటల్ అంతరం ఓ పెద్ద సవాలుగా ఉండేదని చెప్పారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకే డిజిటల్ ఇండియా క్యాంపెయిన్‌ను లాంఛ్ చేశామని చెప్పారు. టెక్నాలజీని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు గట్టి చర్యలు తీసుకున్నామని చెప్పారు. నాటి అంతరం ఇప్పుడు లేదని ప్రధాని అన్నారు.


మొబైల్ ఫోన్లు, టెలికం హార్డ్‌వేర్ స్వదేశంలోనే తయారయ్యేలా సంస్థలను ప్రభుత్వం గతంలో కోరిందని చెప్పారు. ప్రస్తుతం అనేకం దేశీయంగానే ఉత్పత్తి అవుతున్నాయని అన్నారు. మొబైల్ ఫోన్స్‌లో ఎన్నో మార్పులు వచ్చాయని, సుపరిపాలన అందించేందుకు అవి సాధనాలుగా మారాయని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ సేవలు మొబైల్ ఫోన్స్‌లో అందుబాటులో ఉన్న విషయాన్ని చెప్పారు. మొబైల్ ఫోన్స్ కారణంగా విద్య సామాన్యులకు మరింత చేరువైందని అన్నారు. కొవిడ్ సమయంలో 25 కోట్ల మంది విద్యార్థులను అనుసంధానం చేసేందుకు టెలికం నెట్‌వర్క్‌లు ఉపయోగపడ్డాయని గుర్తు చేశారు. నేరుగా నగదు బదిలీల రూపంలో ప్రజలకు రూ.50 లక్షల కోట్లు అందాయని చెప్పారు. ఏటా నిర్వహించే ఈ టెలికం ఐఎంసీ సమావేశాల్లో దేశవ్యాప్తంగా టెలికం సంస్థలు పాల్గొంటాయన్న విషయం తెలిసిందే.


ఈ వార్తలనూ చదవండి:

అవి నిరాధార ఆరోపణలు.. మస్క్‌ పోస్టు‌పై స్పందించిన కేంద్రం

రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు.. నానా పటేకర్ చివరి కామెంట్స్

Updated Date - Oct 08 , 2026 | 01:00 PM