Share News

ఎన్నారైలు అలా ఎప్పుడూ చేయరు.. ఫ్రాన్స్‌ అల్లర్లపై మంత్రి పీయూష్ గోయల్

ABN , Publish Date - Oct 25 , 2026 | 04:15 PM

విదేశాల్లో ఉంటున్న ఎన్నారైలపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తాజాగా ప్రశంసల వర్షం కురిపించారు.

ఎన్నారైలు అలా ఎప్పుడూ చేయరు.. ఫ్రాన్స్‌ అల్లర్లపై మంత్రి పీయూష్ గోయల్
Minister Piyush Goyal

ఇంటర్నెట్ డెస్క్: విదేశాల్లో ఉంటున్న ఎన్నారైలపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తాజాగా ప్రశంసల వర్షం కురిపించారు. ఎన్నారైలు విదేశాల్లో అల్లర్లకు దిగరని, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయరని అన్నారు. జర్మనీ పర్యటన సందర్భంగా బెర్లిన్‌లో ఎన్నారైలతో సమావేశమైన ఆయన ఈ కామెంట్స్ చేశారు. ‘వీధుల్లోకి వచ్చి అలర్లు సృష్టించడం, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేయడం వంటివి భారతీయులు చేయరని పలు దేశాలకు తెలుసు. ఐరోపాలో ప్రస్తుతం మనం చూస్తున్నట్టుగా భారతీయులు సమాజంలో అశాంతిని రేకెత్తించరు’ అని ఆయన అన్నారు. ఫ్రాన్స్ పాలకులు వలసలను ప్రోత్సహించడమే అల్లర్లకు కారణమని ఇటీవల యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.


విదేశాల్లోని ఎన్నారైలు సత్ప్రవర్తనతో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని కేంద్ర మంత్రి ప్రశంసించారు. పైచదువుల కోసం జర్మనీకి వచ్చే సాటి భారతీయులకు సాయం చేయాలని స్థానిక ఎన్నారైలకు పిలుపునిచ్చారు. ఆర్థికంగా వెనుకబడ్డ వారిని ఆదుకోవాలని కోరారు. కొత్త దేశానికి వచ్చిన విద్యార్థులు అక్కడ కాస్త కుదురుకునే వరకూ సాయం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. భారతీయులతో జర్మనీకి ఎంతో ప్రయోజనం ఉంటుందని అన్నారు. ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు, పారిశ్రామిక ఆర్థిక బంధాలను పెంపొందించేందుకు మంత్రి రెండు రోజుల పాటు జర్మనీలో పర్యటించారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం, జర్మనీలో ప్రస్తుతం 3.3 లక్షల మంది భారతీయులు ఉంటున్నారు. అంతేకాకుండా, భారత సంతతికి చెందిన జర్మన్ పౌరులు 70 వేల వరకూ ఉన్నారు.


ఈ వార్తలనూ చదవండి:

వసుధైక కుటుంబం మాటల్లో కాదు.. చేతల్లో చూపిస్తున్నాం: జైశంకర్

దుబాయిలో బతుకమ్మ సంబరాలు.. హాజరైన ధర్మపురి అర్వింద్

Updated Date - Oct 25 , 2026 | 04:39 PM