Share News

పెట్రో ధరలు పెరగవని చెప్పను!

ABN , Publish Date - May 13 , 2026 | 05:29 AM

పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరగవని తాను చెప్పనని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్‌దీ్‌పసింగ్‌ పురీ అన్నారు. నాలుగేళ్లుగా వీటి ధరలు పెంచలేదని చెప్పారు....

పెట్రో ధరలు పెరగవని చెప్పను!

నాలుగేళ్లుగా పెంచని దేశం మనదే: హర్దీప్‌

న్యూఢిల్లీ, మే 12: పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరగవని తాను చెప్పనని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్‌దీ్‌పసింగ్‌ పురీ అన్నారు. నాలుగేళ్లుగా వీటి ధరలు పెంచలేదని చెప్పారు. పెట్రోలు, డీజిల్‌, వంటగ్యా్‌సలను పొదుపుగా వాడుకోవాలని.. ఏడాది వరకు బంగారం కొనవద్దని.. విదేశీ పర్యటనలు చేయొద్దని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును.. మేలుకొలుపుగా చూడాలని వ్యాఖ్యానించారు. పశ్చిమాసియా సంక్షోభంతో ఏర్పడిన ఆర్థిక ఇక్కట్లను తగ్గించుకోవడానికి తగిన చర్యలు మొదలుపెట్టాలన్నది ప్రధాని ఉద్దేశమన్నారు. ఇంధన సంక్షోభం ఉన్నా.. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే పెట్రో ధరలు పెంచలేదన్న విమర్శలను తోసిపుచ్చారు. ‘గత 75 రోజులుగా యుద్ధం కొనసాగుతోంది. నాలుగేళ్లుగా పెట్రో ధరలు పెంచని ఏకైక దేశం మనమే. చివరిసారి 2022లో ధరలు సవరించాం. ఆ తర్వాత కూడా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి’ అని గుర్తుచేశారు. ఎన్నికలకు, ఇంధన ధరలకు సంబంధం లేదని స్పష్టంచేశారు. ఇంధన సరఫరాలో ఎక్కడా ఇబ్బంది లేదన్నారు. 60 రోజులకు సరిపడా ముడిచమురు, 45 రోజులకు చాలినంత ఎల్‌పీజీ నిల్వలు ఉన్నాయని చెప్పారు. దేశీయంగా ఎల్‌పీజీ ఉత్పత్తిని రోజుకు 35-36 వేల టన్నుల నుంచి 54 వేల టన్నులకు పెంచామని తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

ధరలను పెంచే యోచనలో ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీలు.. నిత్యావసరాలు మరింత ప్రియం

అంతర్జాతీయ అనిశ్చితులు.. పసిడి ధరల్లో కోత

Updated Date - May 13 , 2026 | 05:29 AM