పెట్రోల్, డీజిల్ ధరలు పెరగవు: కేంద్రం
ABN , Publish Date - Apr 24 , 2026 | 05:43 AM
పలు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే.. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచే అవకాశం ఉందంటూ జాతీయ మీడియాలో వచ్చిన కథనాలను కేంద్ర ప్రభుత్వం...
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: పలు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే.. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచే అవకాశం ఉందంటూ జాతీయ మీడియాలో వచ్చిన కథనాలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ప్రస్తుతం అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని, పెట్రో ఽధలు పెరగవని స్పష్టం చేసింది. నిజానికి ఈ నెల 29వ తేదీ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.25 నుంచి రూ.28 వరకు పెంచవచ్చంటూ స్టాక్ మార్కెట్ బ్రోకరేజీ సంస్థ కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ విడుదల చేసిన నివేదికను ఉటంకిస్తూ బుధవారం వార్తలు వెలువడ్డాయి. ఆ కథనాలు అవాస్తవమని పేర్కొంటూ కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలు ప్రజల్లో అనవసర ఆందోళన రేకెత్తిస్తాయని స్పష్టం చేసింది. గత నాలుగేళ్లలో ప్రపంచంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచని ఒకే ఒక్క దేశం భారత్ అని పేర్కొంది. చమురు సంస్థలకు ఒక్కో లీటరు పెట్రోల్‌పై రూ.20, డీజిల్‌పై రూ.100 చొప్పున నష్టం వస్తోందని వెల్లడించింది. అయినా దేశ ప్రజలపై భారం పడకుండా చర్యలు చేపడుతున్నామని పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
శాంతి చర్చల విషయంలో ఒత్తిడి లేదు.. మా దృష్టి దాని పైనే: డొనాల్డ్ ట్రంప్
నెతన్యాహు ప్లాన్‌ను వాళ్లు తిరస్కరించారు.. ట్రంప్ అంగీకరించారు: విదేశాంగ మాజీ కార్యదర్శి