Share News

పవన్‌ ఖేడాకు ట్రాన్సిట్‌ ముందస్తు బెయిల్‌

ABN , Publish Date - Apr 11 , 2026 | 06:23 AM

అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ భార్యపై ఆరోపణలకు సంబంధించి అక్కడి పోలీసులు నమోదు చేసిన కేసులో...

పవన్‌ ఖేడాకు ట్రాన్సిట్‌ ముందస్తు బెయిల్‌

  • తెలంగాణవాసినంటూ ఇక్కడ హైకోర్టులో పిటిషన్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ భార్యపై ఆరోపణలకు సంబంధించి అక్కడి పోలీసులు నమోదు చేసిన కేసులో కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పవన్‌ ఖేడాకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. కోర్టు ఆయనకు వారం రోజులపాటు ట్రాన్సిట్‌ యాంటిసిపేటరీ బెయిల్‌ మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు వెలువరించింది. బెయిల్‌కోసం చేసిన దరఖాస్తులో పవన్‌ ఖేడా.. తాను తెలంగాణ వాసిని అని పేర్కొన్నారు. తన భార్య సనత్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీచేశారని తెలిపారు. విచారణ చేపట్టిన జస్టిస్‌ కే సుజన ధర్మాసనం.. వారంపాటు ట్రాన్సిట్‌ యాంటిసిపేటరీ బెయిల్‌ మంజూరు చేసింది. ఆయన భౌగోళిక అధికార పరిధి కలిగిన కాంపిటెంట్‌ కోర్టును ఆశ్రయించడానికి వీలుగా ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. ఆయన దాఖలు చేసే రెగ్యులర్‌ బెయిల్‌ లేదా ముందస్తు బెయుల్‌ పిటిషన్‌పై అధికార పరిధి కలిగిన కోర్టు మెరిట్స్‌ ఆధారంగా తగిన నిర్ణయం తీసుకోవచ్చని తెలిపింది.

ఈ వార్తలు కూడా చదవండి

మహిళల జోలికొస్తే అదే చివరి రోజు: మంత్రి సవిత..

బొత్స భావోద్వేగం.. వైఎస్ షర్మిల రియాక్షన్

Updated Date - Apr 11 , 2026 | 06:23 AM