దేశవ్యాప్త ‘నీట్’కు స్వస్తి!
ABN , Publish Date - Jul 03 , 2026 | 05:41 AM
వరుస లీకులు, పరీక్ష రద్దు నిర్ణయాలతో వివాద కేంద్రంగా మారిన ‘నీట్’ నిర్వహణ ప్రక్రియలో మార్పులు అవసరమని పార్లమెంటరీ స్థాయీ సంఘం సూచించింది. ఇప్పటిలా ఒకేరోజు...
పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫారసు
దేశవ్యాప్త ‘నీట్’కు స్వస్తి!
రాష్ట్రాల్లో బహుళ స్థాయుల్లో నిర్వహణ
పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫారసు
న్యూఢిల్లీ, జూలై 2 : వరుస లీకులు, పరీక్ష రద్దు నిర్ణయాలతో వివాద కేంద్రంగా మారిన ‘నీట్’ నిర్వహణ ప్రక్రియలో మార్పులు అవసరమని పార్లమెంటరీ స్థాయీ సంఘం సూచించింది. ఇప్పటిలా ఒకేరోజు దేశవ్యాప్తంగా నీట్-యూజీ పరీక్ష నిర్వహించడం కాకుండా, రాష్ట్రాలన్నింటిలో బహుళ స్థాయుల్లో నిర్వహించాలని ప్రతిపాదించింది. దీనివల్ల రవాణాకు సంబంధించిన ఒత్తిడిని, ఏర్పాట్లలోని సంక్లిష్టతను చాలావరకు నివారించవచ్చునని తెలిపింది. ఈ మేరకు ముకుల్ వాస్నిక్ నేతృత్వంలో సమావేశమైన విద్య, మహిళ, శిశు, యువజన, క్రీడల వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం కీలక ప్రతిపాదనలను చేసింది. దేశంలోనే అతి పెద్ద జాతీయ అర్హత- ప్రవేశ పరీక్ష ‘నీట్’. లక్షల్లో అభ్యర్థులు హాజరవుతారు. ఇంతమందికి ఒకేరోజు పరీక్షను నిర్వహించడంలోని కష్టాన్ని దృష్టిలో ఉంచుకుని ఎంబీబీఎస్, ఆయుష్, నర్సింగ్ కోర్సులకు వేర్వేరుగా ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తే ఎలా ఉంటుందని ఈ భేటీలో చర్చ జరిగింది.
ఇవి కూడా చదవండి
టీ తాగడం మంచిదే.. కానీ ఈ 6 పొరపాట్లు చేస్తే సమస్యలు తప్పవు
కోళ్లు అరుస్తున్నాయని వెళ్లి చూస్తే.. మృత్యువు వెంటాడింది