పార్లమెంటరీ కమిటీలకు చైర్మన్లు పీఏసీకి కేసీ వేణుగోపాల్ పునర్నియామకం
ABN , Publish Date - May 01 , 2026 | 06:16 AM
పార్లమెంటుకు సంబంధించి అత్యంత కీలకమైన కమిటీలను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. కమిటీలకు చైర్మన్‌లను గురువారం...
పలువురు తెలుగు ఎంపీలకు కమిటీల్లో స్థానం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 30(ఆంధ్రజ్యోతి): పార్లమెంటుకు సంబంధించి అత్యంత కీలకమైన కమిటీలను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. కమిటీలకు చైర్మన్‌లను గురువారం నియమించారు. 2026-27 సంవత్సరానికి గాను ప్రజాపద్దుల కమిటీ(పీఏసీ) చైర్మన్‌గా లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్‌ను పునర్నియమించారు. ప్రభుత్వ రంగ సంస్థల కమిటీకి బీజేపీ ఎంపీ బైజయంత్ పాండాను నియమించారు. ఈ చైర్మన్ల పదవీ కాలం మే 1, 2026 నుంచి ఏప్రిల్ 30, 2027 వరకు కొనసాగుతుంది. తాజా కమిటీల పునర్వ్యవస్థీకరణలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎంపీలకు చోటు దక్కింది. పీఏసీలో లోక్‌సభ నుంచి మాగుంట శ్రీనివాసులురెడ్డి(టీడీపీ), వల్లభనేని బాలశౌరి(జనసేన), సీఎం రమేశ్(బీజేపీ), రాజ్యసభ నుంచి కే లక్ష్మణ్(బీజేపీ) సభ్యులుగా ఎంపికయ్యారు. పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీలో టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి చోటు లభించింది. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ కమిటీలో లోక్‌సభలో టీడీపీ ఉపనేత దగ్గుమళ్ల ప్రసాదరావు, కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి సభ్యులుగా నియమితులయ్యారు.
ఈ వార్తలనూ చదవండి:
అమెరికాకు హ్యాండిచ్చిన పాక్.. ఇరాన్‌కు సాయం!
పుతిన్ ఆఫర్‌ను తిరస్కరించిన ట్రంప్.. 90 నిమిషాలు మాట్లాడుకున్న నేతలు..