డిసెంబరు 15లోగా పార్లమెంట్!
ABN , Publish Date - Nov 26 , 2026 | 06:28 AM
వచ్చే నెల 15లోగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మరోసారి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి
న్యూఢిల్లీ : వచ్చే నెల 15లోగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మరోసారి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. విదేశీ పర్యటనలు పక్కన పెట్టి, మంత్రులు ఇందుకు సిద్ధంగా ఉండాలని బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రధాని మోదీ కోరినట్టు సమాచారం. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాయిదాపడి 103 రోజులైనా, ఇంకా ప్రొరోగ్ కాకపోవడంపై విపక్షాలు ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో విడత పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు సిద్ధమవడం విశేషతెలుగు రాష్ట్రాలకు కామరాజర్ గేట్‌వే చెన్నై సమీపంలోని ఎన్నూరు వద్ద ఉన్న కామరాజర్ పోర్టులో రూ.4,288.26 కోట్లతో రెండో కంటైనర్ టెర్మినల్ నిర్మాణానికి సీసీఈఏ ఆమోదం తెలిపింది. దీన్ని ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) కింద చేపడతారు. 900 మీటర్ల పొడవైన ఈ టెర్మినల్‌కు ఏటా 20 లక్షల టీఈయూల (ఇరవై అడుగుల కంటైనర్ యూనిట్లు) సామర్థ్యం ఉంటుంది. 18 మీటర్ల లోతుతో టెర్మినల్ ఏర్పాటు చేస్తుండటంతో 24,346 టీఈయూల సామర్థ్యం గల 400 మీటర్ల భారీ నౌకలు కూడా నేరుగా రాగలవు. దీంతో విదేశీ హబ్ పోర్టుల మీదుగా సరుకు పంపే ఖర్చు తగ్గుతుంది. తమిళనాడుతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లోని పరిశ్రమల ఎగుమతి-దిగుమతుల కోసం ఈ టెర్మినల్ ఉపయోగపడుతుందని కేంద్రం పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి...
మత్స్యకారుల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలించాలి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి