అమిత్‌షా ప్రకటన ఇచ్చే వరకు పార్లమెంట్‌లో ప్రతిష్ఠంభన కొనసాగుతుంది: ప్రియాంక గాంధీ
ABN , Publish Date - Aug 10 , 2026 | 01:27 PM
పార్లమెంట్ మార్చ్ సందర్భంగా విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు లాఠీఛార్జ్ చేయడంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వివరణ ఇవ్వాలని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతోంది.
న్యూఢిల్లీ, ఆగస్టు 10: పార్లమెంట్ మార్చ్ సందర్భంగా విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు లాఠీఛార్జ్ చేయడంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వివరణ ఇవ్వాలని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతోంది. ప్రకటన వచ్చేవరకు పార్లమెంట్‌లో అధికార, ప్రతిపక్షాల మధ్య ప్రతిష్ఠంభన కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా తేల్చి చెప్పారు. సోమవారం పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో ప్రియాంక గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. ‘కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రకటన ఇచ్చే వరకు పార్లమెంట్‌లో ప్రతిష్ఠంభన కొనసాగుతుంది’ అని అన్నారు.
అమిత్‌షా సమాధానం చెప్పాల్సిందే: రాహుల్ గాంధీ
ఢిల్లీ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సమాధానం చెప్పి తీరాల్సిందేనని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. విద్యార్థులపై దాడి ఘటనపై ప్రకటన ఇవ్వడానికి ఆయన పార్లమెంట్‌కు రావాల్సిందేనని పట్టుబట్టారు. పోలీసుల దాడిలో యువతులు, మైనర్లు గాయపడ్డారని అన్నారు. కాల్పులపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి
ఏపీలో కీలక అధికారుల బదిలీలపై నిషేధం పొడిగింపు..
ఏపీ పీపీపీ పాలసీ-2026 విడుదల.. రూ.1,500 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్