Share News

నేతల పడక గదుల్లోకి వెళ్లకుండా మహిళలు రాజకీయాల్లోకి రాలేరు

ABN , Publish Date - Apr 23 , 2026 | 05:37 AM

రాజకీయ నేతలు, మహిళలపై బిహార్‌ స్వతంత్ర ఎంపీ పప్పూ యాదవ్‌ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు....

నేతల పడక గదుల్లోకి వెళ్లకుండా మహిళలు రాజకీయాల్లోకి రాలేరు

  • బిహార్‌ ఎంపీ పప్పూయాదవ్‌ నోటి దురుసు

మాల్డా (పశ్చిమ బెంగాల్‌), ఏప్రిల్‌ 22: రాజకీయ నేతలు, మహిళలపై బిహార్‌ స్వతంత్ర ఎంపీ పప్పూ యాదవ్‌ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. మహిళలకు 33% రిజర్వేషన్‌ అంశంపై ఇటీవల పప్పూ యాదవ్‌ స్పందిస్తూ.. మహిళలను పురుష నేతలు ఆకలిగొన్న జంతువుల్లా చూస్తుంటారని పరుష వ్యాఖ్యలు చేశారు. అక్కడితో ఆయన ఆగలేదు. ‘‘రాజకీయ నేతల పడక గదుల్లోకి వెళ్లకుండా ఈ దేశంలోని 90% మంది మహిళలు కనీసం రాజకీయాల్లోకి అడుగుపెట్టలేరు’’ అంటూ మరింత అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై బిహార్‌ మహిళా కమిషన్‌ తీవ్రంగా స్పందించింది. సుమోటోగా పప్పూ వ్యవహారాన్ని విచారణకు స్వీకరించింది. ‘మీ సభ్యత్వం తొలగించాలని లోక్‌సభ స్పీకర్‌ను ఎందుకు కోరరాదో మూడు రోజుల్లో వివరణ ఇవ్వండి’ అంటూ నోటీసులు జారీచేసింది. అయినా, వెనక్క తగ్గని పప్పూ బుధవారం కమిషన్‌పైనా నోటి దురుసు ప్రదర్శించారు. ‘‘నాకు నోటీసులివ్వడానికి మీరెవరు? ఎవరికోసం ఇదంతా చేస్తున్నారు? అద్దాల గదుల్లో బతికేవాళ్లు ఎదుటివాళ్లపై రాళ్లు వేయకూడదు’’ అంటూ మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి..

పీఎంపై వ్యాఖ్యల వివాదం.. ఖర్గేకు ఈసీ నోటీసు

సీఎం సిద్ధరామయ్యపై చేతబడి జరిగిందేమో.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

Updated Date - Apr 23 , 2026 | 05:37 AM