Share News

పాక్ ఇంకా ఉగ్రవాద సంస్థలకు షెల్టర్ ఇస్తోంది.. భారత్‌కు అమెరికా నివేదిక హెచ్చరిక..

ABN , Publish Date - Mar 28 , 2026 | 08:22 PM

కాంగ్రేషనల్ రీసెర్చ్ సర్వీస్ విడుదల చేసిన రిపోర్టులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. పాకిస్థాన్ ఇప్పటి కూడా పెద్ద సంఖ్యలో ఉగ్రవాద గ్రూపులకు ఆశ్రయం ఇస్తోందని.. ఇండియాను, కాశ్మీర్‌ను టార్గెట్ చేసుకున్న ఉగ్రవాద సంస్థలకు కూడా పాకిస్థాన్ ఆశ్రయం కల్పిస్తోందని ఆ రిపోర్టు తెలిపింది.

పాక్ ఇంకా ఉగ్రవాద సంస్థలకు షెల్టర్ ఇస్తోంది.. భారత్‌కు అమెరికా నివేదిక హెచ్చరిక..
Pakistan terrorism

న్యూఢిల్లీ, మార్చి 28: అమెరికాకు చెందిన కాంగ్రేషనల్ రీసెర్చ్ సర్వీస్ విడుదల చేసిన రిపోర్టులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. పాకిస్థాన్ ఇప్పటి కూడా పెద్ద సంఖ్యలో ఉగ్రవాద గ్రూపులకు ఆశ్రయం ఇస్తోందని.. ఇండియాను, కాశ్మీర్‌ను టార్గెట్ చేసుకున్న ఉగ్రవాద సంస్థలకు కూడా పాకిస్థాన్ ఆశ్రయం కల్పిస్తోందని ఆ రిపోర్టు తెలిపింది. ఏళ్ల పాటు మిలటరీ ఆపరేషన్లు, విధానపరమైన చర్యలు తీసుకుంటున్నా కూడా ఉగ్రవాద గ్రూపులు ఇంకా పాకిస్థాన్ మట్టినుంచే కార్యకలాపాలు సాగిస్తున్నాయన్న విషయాన్ని కాంగ్రేషనల్ రీసెర్చ్ సర్వీస్ రిపోర్టు నొక్కి చెప్పింది.


కాంగ్రేషనల్ రీసెర్చ్ సర్వీస్ రిపోర్టు ప్రకారం.. 2008 ముంబై దాడులకు కారణమైన లష్కర్ ఈ తోయిబా, 2001లో పార్లమెంట్‌పై దాడి చేసిన జైషే ఈ మహ్మద్ ఉగ్రవాద గ్రూపులు ఇంకా యాక్టీవ్‌లోనే ఉన్నాయి. పాకిస్థాన్ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఉగ్రవాదంతో అత్యంత ఎక్కువగా ప్రభావితం అయిన దేశం పాకిస్థాన్. ఉగ్రవాద సంస్థల్లో ఎక్కువ శాతం ఇస్లామిస్ట్ ఎక్స్‌ట్రీమిస్ట్ ఐడియాలజీతోనే నడుస్తున్నాయి. ఈ గ్రూపులు మొత్తం ఐదు రకాలుగా ఉన్నాయి. అంతర్జాతీయ లక్ష్యాలు కలిగినవి, ఆఫ్ఘనిస్థాన్‌పై దృష్టి సారించినవి, భారత్- కాశ్మీర్ అంశాలపై పనిచేసేవి, స్వదేశీ (పాకిస్థాన్ లోపల) వ్యవహారాలకే పరిమితమైనవి, మతతత్వ ముఠాలు పాకిస్థాన్‌నుంచి పని చేస్తున్నాయి.


ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఖోరసన్ ప్రావిన్స్‌లో 4 వేల నుంచి 6 వేల మంది దాకా ఉగ్రవాదులు ఉన్నారు. ఈ గ్రూపు పాకిస్థాన్‌తో పాటు ఆఫ్ఘనిస్థాన్‌‌లోనూ కార్యకలాపాలు సాగిస్తోంది. ఇతర ఉగ్రవాద సంస్థల్లో పని చేసిన వారు కూడా ఈ గ్రూపులో సభ్యులుగా ఉన్నారు. పాకిస్థాన్‌నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న అత్యంత ప్రాణాంతకమైన ఉగ్రవాద గ్రూపుగా తెహ్రీక్ ఐ తాలిబన్ పాకిస్థాన్‌ను నివేదిక పేర్కొంది. ఈ గ్రూపులో 2500 నుంచి 5000 మంది దాకా ఉగ్రవాదులు ఉన్నారు. పాకిస్థాన్‌ను విస్తరించటం, షరీయా చట్టాలను అమలు చేయటం ఈ ఉగ్రవాద సంస్థ లక్ష్యమని నివేదిక తెలిపింది.


ఇవి కూడా చదవండి

అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ఎప్పుడూ కలిసే సాగాలి: చంద్రబాబు

ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఆ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్..

Updated Date - Mar 28 , 2026 | 08:29 PM