Share News

తాజ్‌మహల్ చూస్తానన్న పాక్ మంత్రి.. కుదరదన్న భారత్

ABN , Publish Date - Nov 20 , 2026 | 05:23 PM

షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) సివిలైజేషనల్ డైలాగ్ ఫోరమ్ సదస్సులో పాల్గొనేందుకు పాక్ మంత్రి ముసాదిక్ మాలిక్ న్యూఢిల్లీకి వచ్చారు. అయితే, తాజ్‌మహల్ సందర్శనకు ఆయనను కేంద్రం అనుమతించలేదు. ఆయన వీసా కేవలం ఎస్‌సీఓ సదస్సుకే పరిమితమని కేంద్ర వర్గాలు పేర్కొన్నాయి.

తాజ్‌మహల్ చూస్తానన్న పాక్ మంత్రి.. కుదరదన్న భారత్
Musadik Malik Denied Permission to Visit Tajmahal

ఇంటర్నెట్ డెస్క్: షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) సివిలైజేషనల్ డైలాగ్ ఫోరమ్ సదస్సులో పాల్గొనేందుకు పాక్ మంత్రి ముసాదిక్ మాలిక్ న్యూఢిల్లీకి వచ్చారు. అయితే, తాజ్‌మహాల్ సందర్శించేందుకు ఆయనకు అనుమతి లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తాజాగా స్పష్టం చేశాయి. ఆగ్రాలోని తాజ్‌మహల్‌తో పాటు న్యూఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ దర్గా సందర్శనకు ఆయన అనుమతి కోరగా కేంద్రం నిరాకరించినట్టు తెలిసింది. ఆయన వీసా కేవలం ఎస్‌సీఓ సదస్సులో పాల్గొనేందుకు మాత్రమేనని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.


నేటి నుంచి ఈ సదస్సు ప్రారంభమైంది. నవంబర్ 22 వరకూ కొనసాగుతుంది. ఇందులో పాల్గొనేందుకు మంత్రి ముసాదిక్ మాలిక్ సారథ్యంలో పాక్ బృందం కూడా వచ్చింది. ఎస్‌సీఓ దేశాల నాగరికతలు, సంసృతిపై చర్చకు ఇది అద్భుత అవకాశమని పాక్ మంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. సంస్కృతి, నాగరికతలకు ఎలాంటి సరిహద్దులు ఉండవని అన్నారు. ‘మన చరిత్ర, సంస్కృతి, భౌగోళిక అంశాలు, నాగరికతలపై చర్చించేందుకు భారత్‌కు రావడం ఎంతో ఆనందంగా ఉంది’ అని వ్యాఖ్యానించారు.


ఎస్‌సీఓ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ స్టేట్‌కు 2026-27 సంవత్సరానికి గాను పాక్ సారథ్యం వహిస్తోంది. వచ్చే ఏడాది జరగనున్న శిఖరాగ్ర సమావేశాల్లోపు జరగనున్న అనేక సదస్సులకు పాక్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక ఎస్‌సీఓ దేశాల మధ్య ఉమ్మడి నాగరికతపై చర్చించేందుకు, సహకారాన్ని మరింత పెంపొందించేందుకు ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

భారత్‌కు పాక్ మంత్రి రాక.. మోదీ సర్కారుపై విపక్షాల విమర్శలు

తమిళనాడుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. కావేరీ నీటి అభ్యర్థన తిరస్కరణ..

Updated Date - Nov 20 , 2026 | 05:25 PM