వరికి మరో రూ.72
ABN , Publish Date - May 14 , 2026 | 05:46 AM
అన్నదాతలకు ఊరటనిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 2026-27 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి 14 రకాల పంటలకు కనీస మద్దతు ధరలను (ఎమ్మెస్పీ) పెంచేందుకు....
క్వింటాల్‌కు సాధారణ రకానికి రూ.2,441, ఏ గ్రేడ్‌కు 2,461
పంటలకు మద్దతు ధర పెంచుతూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం
అత్యధికంగా పొద్దుతిరుగుడుకు రూ.622 పెంపు
మొక్కజొన్న, పప్పుధాన్యాలు, నూనెగింజలకు కూడా..
రూ.20,667 కోట్లతో గుజరాత్‌లో సెమీ హైస్పీడ్ రైల్వేట్రాక్
నాగ్‌పూర్ ఎయిర్‌పోర్టు ఆధునికీకరణకు పచ్చజెండా
న్యూఢిల్లీ, మే 13 (ఆంధ్రజ్యోతి): అన్నదాతలకు ఊరటనిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 2026-27 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి 14 రకాల పంటలకు కనీస మద్దతు ధరలను (ఎమ్మెస్పీ) పెంచేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. రైతులకు పెట్టుబడిపై కనీసం 50ు లాభం చేకూర్చాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించింది. వరికి మద్దతు ధరను రూ.72 పెంచారు. దీనితో సాధారణ రకం మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,441కి చేరింది. అత్యధికంగా పొద్దుతిరుగుడు గింజలకు క్వింటాల్ రూ.622 మేర ధర పెంచారు. ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ ఉప సంఘం(సీసీఈఏ)లో తీసుకున్న నిర్ణయాలను మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. 2014-2026 మధ్య వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని చెప్పారు. రైతుల నుంచి వరి ధాన్యం ేసకరణ, చెల్లింపులు భారీగా పెరిగాయన్నారు. 2004-14 మధ్య వరి రైతులకు రూ. 4.44 లక్షల కోట్లు చెల్లించగా.. 2014-26 మధ్య ఈ మొత్తం రూ.16.08 లక్షల కోట్లకు చేరిందని వివరించారు. తాజా ధరల పెరుగుదలతో.. పెసర సాగు చేేస రైతులకు అత్యధికంగా 61 శాతం లాభం వచ్చే అవకాశం ఉందన్నారు. తర్వాత మొక్కజొన్న, సజ్జ రైతులకు 56శాతం, కంది రైతులకు 54 శాతం మేర లాభం చేకూరుతుందన్నారు. నూనెగింజలు, పప్పుధాన్యాల సాగును ప్రోత్సహించే ఉద్దేశంతో ఆ పంటలకు మద్దతు ధర పెంచామన్నారు. ఇక రూ.20,667 కోట్లతో గుజరాత్‌లో సర్ఖేజ్-ధొలేరా సెమీ హైస్పీడ్ రైల్వేట్రాక్ నిర్మాణానికి, నాగ్‌పూర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆధునీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు.
పంట ఎమ్మెస్పీ పెరిగిన
(క్వింటాల్‌కు) మొత్తం
వరి (సాధారణ) 2,441 72
వరి (గ్రేడ్-ఏ) 2,461 72
జొన్న (హైబ్రిడ్) 4,023 324
జొన్న (మల్దండి) 4,073 324
సజ్జలు 2,900 125
రాగులు 5,205 319
మొక్కజొన్న 2,410 10
కందులు 8,450 450
పెసర 8,780 12
మినుములు 8,200 400
వేరుశనగ 7,517 254
పొద్దుతిరుగుడు 8,343 622
సోయాబీన్ (పచ్చ) 5,708 380
నువ్వులు 10,346 500
అవిసెలు 10,052 515
పత్తి (మధ్యస్థ పింజ) 8,267 557
పత్తి (పొడుగు పింజ) 8,667 557
ఈ వార్తలు కూడా చదవండి
ఎయిర్ ఇండియా సంస్థ కీలక నిర్ణయం.. ఆ మార్గాల్లో విమానాల రద్దు..
నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు.. ఐదుగురి అరెస్ట్